
కోలీవుడ్ లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా మారాడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). ఆయన స్వీయ దర్శకత్వంలో చేసిన లవ్ టుడే (Love Today) తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయింది. హీరోగా తొలి ప్రయత్నంలోనే రూ.వంద కోట్ల క్లబ్ లో చేరి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక తాజాగా ఆయన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ అనే మూవీతో మరోసారి ప్రేక్షకులను పలకరించాడు.
10 రోజుల్లో రూ.100 కోట్లు
తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ చిత్రం (Return Of The Dragon) ఇరు రాష్ట్రాల ప్రేక్షకులను అలరించింది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రదీప్‌కి జోడీగా అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), కయాదు లోహర్ నటించారు. ఫిబ్రవరి 21వ తేదీన విడుదలైన ఈ సినిమా యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. రిలీజ్ అయిన పది రోజులకే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టింది.
మార్చి 21న ఓటీటీలోకి డ్రాగన్
అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలో (Dragon Ott)కి వచ్చేందుకు రెడీ అయింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకుంది. ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లో ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ సినిమా నాలుగు వారాల తర్వాత మార్చి 21వ తేదీన ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
కావాలనే కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు: Pooja Hegde
సౌత్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనీ ఇచ్చి మరీ తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ బాంబ్ పేల్చింది. తాజాగా ఈ అమ్మడు కావాలనే కొంతమంది తనపై నెగిటివ్…