
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల(Online Betting Apps)ను ప్రమోట్ చేస్తున్న విశాఖపట్నానికి చెందిన ప్రముఖ యూట్యూబర్ వాసుపల్లి నాని(YouTuber Vasupalli Nani) అలియాస్ ‘లోకల్ బాయ్’ నానిని సైబర్ క్రైం పోలీసులు(Cyber crime police) అరెస్ట చేశారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించవచ్చంటూ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను నాని తన యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్(Instagram) ఖాతాల్లో పోస్టు చేస్తున్నాడు.
చర్యలు తీసుకోవాలని యువకుడి ఫిర్యాదు
ఈ క్రమంలో నగరానికి చెందిన ఓ యువకుడు DAFABET, PARIMATCH, MAHADEVBOOK, RAJABET వంటి ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లలో రూ. 2కోట్ల వరకు పోగొట్టుకున్నాడు. ఇలాంటి ప్రచారాల వల్ల తనలాగే యువత బెట్టింగ్‌లో పాల్గొని తమ భవిష్యత్తును పాడు చేసుకుని అవకాశం ఉందని, యువతను తప్పుదోవ పట్టిస్తున్న లోకల్ నాని పై తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. దీంతో శనివారం రాత్రి నానిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
నానిపై సజ్జనార్ ఆగ్రహం
ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న నానిపై ఆ యువకుడు సైబర్ క్రైం పోలీసులు ఫిర్యాదు చేశాడు. మరోవైపు, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్(Telangana RTC MD Sajjanar) కూడా నానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే తాను చదువుకోలేదని, భవిష్యత్‌లో ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటానని నాని అన్నాడు. డబ్బులు వస్తాయంటే ఏదో తెలియక చేశానని, ఇంత ప్రమాదం జరుగుతుందని ఊహించలేదని నాని వీడియో రిలీజ్ చేశాడు. యూట్యూబర్ నాని వీడియోపై సజ్జనార్ మళ్లీ స్పందించారు. తప్పు తెలుసుకున్నావు, ఇంకెప్పుడు ఇలాంటివి చేయకపోవడం మంచిదని హితవు పలికారు.