‘SVSC’ రీరిలీజ్.. థియేట‌ర్‌లో పూల కుండీలకు నో ఎంట్రీ

టాలీవుడ్ స్టార్ హీరోస్.. విక్టరీ వెంక‌టేశ్(Victory Venkatesh), సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు (Mahesh Babu) ప్రధాన పాత్రల్లో 2013లో వచ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu). శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ సినిమాను శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజ్ నిర్మించారు. ప్ర‌కాశ్ రాజ్, జ‌య‌సుధ, అంజలి, సమంత కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా వ‌చ్చి 12 ఏళ్లవుతున్న సంద‌ర్భంగా ఇవాళ రీ-రిలీజ్(SVSC Re Release) చేశారు.

పూలకుండీలకు నో ఎంట్రీ

ఇక ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను మరోసారి బిగ్ స్క్రీనుపై చూసేందుకు మహేశ్ బాబు, వెంకీ ఫ్యాన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. అయితే ఈ చిత్రంలో పూలకుండీ సీన్ బాగా ఫేమస్ అయిన విషయం తెలిసిందే. పూలకుండీని ఎందుకు తన్నావురా అంటూ వెంకీ మహేశ్ తో చెప్పే డైలాగ్ బాగా పాపులర్ అయింది. ఈ సినిమా రి రిలీజ్ సందర్భంగా మూవీ చూసేందుకు వచ్చే కొందరు అభిమానులు పూలకుండీలను వెంట తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో థియేటర్ యాజమాన్యం పూలకుండీలను హాలులోకి అనుమతించడం లేదు.

పూలకుండీని ఎందుకురా తన్నావు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అన్న‌ద‌మ్ములుగా న‌టించిన వెంకటేశ్, మ‌హేశ్ సినిమా ఇంట‌ర్వెల్ సమయంలో గొడవ పడతారు. ఈ  గొడ‌వ అనంత‌రం మ‌హేశ్ న‌డుచుకుంటూ వెళుతూ ప‌క్కనున్న పూల కుండీని తన్నుతాడు. దీంతో పెద్దోడు అయిన‌ వెంకీ చిన్నోడు(మ‌హేశ్)ని అడుగుతూ.. పూల కుండీని ఎందుకురా అలా త‌న్నావు అంటాడు.

పూలకుండీ సీన్ రీ క్రియేట్

ఈ సీన్ చాలా పాపులర్ కావడంతో మీమ్స్ కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.  ఇక ఇప్పుడు సినిమా రి రిలీజ్ కావడంతో థియేటర్ కు వెళ్లిన ఫ్యాన్స్ ఈ సీన్ ను రీక్రియేట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే సినిమా హాలులోకి పూలకుండీని తీసుకెళ్తుండగా వాటిని థియేటర్ యాజమాన్యం అనుమతించడం లేదు. అయితే కొందరు సిబ్బంది కళ్లు గప్పి పూలకుండీలను తీసుకెళ్లి ఈ సీన్ ను రీక్రియేట్ చేశారు. ఆ వీడియోలు ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

Related Posts

Mufasa:The Lion King: ఓటీటీలోకొచ్చిన ముఫాసా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

హాలీవుడ్(Hollywood) బ్లాక్ బ‌స్ట‌ర్ ‘ముఫాసా: ది లయన్‌ కింగ్ (Mufasa The Lion King)’ డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ‘ది లయన్ కింగ్(he Lion King)’ సినిమాకు ప్రీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం…

కావాలనే కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు: Pooja Hegde

సౌత్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనీ ఇచ్చి మరీ తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ బాంబ్ పేల్చింది. తాజాగా ఈ అమ్మడు కావాలనే కొంతమంది తనపై నెగిటివ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *