
ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో ప్రాథమిక పాఠశాలకు దాతలు శాశ్వత ప్రాతిపదికన శుద్ధిచేసిన తాగునీరు అందించారు. సూర్యప్రకాష్ ఫౌండేషన్ తరఫున చెక్కును అందజేశారు. కీర్తి శేషులు కోలేటి సూర్య ప్రకాష్ రావు 61వ జయంతి సందర్భంగా కోలేటి వివేక్ చౌదరి, సాత్విక్ చౌదరి కలిసి ఈ చెక్కును పాఠశాల యాజమాన్యానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన కుమారులు మాట్లాడుతూ.. తమ ఫౌండేషన్ తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. పాఠశాలకు తాగునీరు అందించేందుకు సాయం చేసిన సూర్య ప్రకాష్ ఫౌండేషన్ కు యాజమాన్యం కృతజ్ఞత తెలిపింది.