చెర్రీ ‘వీణ స్టెప్పు’ వేస్తే.. గేమ్ ఛేంజర్ నుంచి ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ రిలీజ్

Mana Enadu : గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా దర్శకుడు శంకర్‌ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్‌ ఛేంజర్‌’. కియారా అడ్వాణీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో హీరో ఇంట్రడక్షన్‌ సాంగ్‌ ‘రా మచ్చ మచ్చ (Raa Macha Macha)’ ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ పాటలో చెర్రీ తన ఎనర్జిటిక్ స్టెప్పులతో అదరగొట్టాడు. రామ్ చరణ్ స్వాగ్, అదిరిపోయే స్టెప్పులు ఈ పాటకు హైలైట్ గా నిలిచాయి.

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ సినిమాలోని వీణ స్టెప్పు (Veena Step)ను ఈ పాటలో కాపీ చేశారు. ఈ స్టెప్పును చెర్రీ తన దైన స్వాగ్ లో చేసి అలరించారు. ఈ పాటలో రామ్ చరణ్ డ్యాన్స్ వేరే లెవెల్ ఉందని నెటిజన్లు అంటున్నారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman) కంపోజ్ చేశారు. ఈ సాంగ్ ను నకాశ్ అజీజ్ పాడారు.

సీనియర్ డైరెక్టర్ శంకర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా (Game Changer)లో యస్​ జే సూర్య (SJ Surya), అంజలి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ వేంకటేశ్వర బ్యానర్​పై దిల్​రాజు భారీ బడ్జెట్​తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ ఆఖరి వారంలో రిలీజ్ కానుంది.

Related Posts

Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్

ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…

Gold&Silver Price: తగ్గిన బంగారం ధరలు.. కేజీ వెండి రేటు ఎంతంటే?

గత 15 రోజులుగా చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు(Gold Rates) ఎట్టకులకు తగ్గాయి. ఈనెలలో రికార్డు స్థాయికి చేరిన పుత్తడి ధర సామాన్యులకు అందుబాటులో లేకుండా పైపైకి ఎగబాకింది. ఈ క్రమంలో బంగారు ఆభరణాల(gold jewellery)కు డిమాండ్‌ 80శాతం వరకు పడిపోయింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *