
ముఖాలు కనిపించకుండా సినిమా తీయడం అనేది సినీ చరిత్రలో ఎవరూ చేయని సాహసం. నటుల ముఖాలు చూపించకుండా కేవలం కథ, కథనాలతో ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేసేందుకు మార్చి 7వ తేదీన థియేటర్లలోకి వస్తోంది రా రాజా (Raa Raja) సినిమా. హార్రర్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాను అందరూ చూసి సక్సెస్ చేయాలని డైరెక్టర్ శివప్రసాద్ కోరారు. పద్మ సమర్పణలో పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి.శివ ప్రసాద్ తెరకెక్కించిన ‘రా రాజా’ మూవీ మార్చి 7వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా దర్శకుడు బి. శివ ప్రసాద్ మాట్లాడుతూ .. ‘నిర్మాతగా సినిమాలు చేస్తున్న టైంలో నా మైండ్‌లోకి వచ్చిన పాయింట్‌ను కథగా మార్చాను. అలా అనుకోకుండానే నేను దర్శకుడిగా మారిపోయాను. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఇప్పటి వరకు చూసిన వారంతా మెచ్చుకున్నారు. ఈ చిత్రం మార్చి 7న రాబోతోంది. అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర మాట్లాడుతూ .. ‘రా రాజా చిత్రానికి మంచి మ్యూజిక్ ఇచ్చే స్కోప్ దక్కింది. శివ ప్రసాద్ గారు నాకు నిర్మాతగా ఎప్పటి నుంచో తెలుసు. రా రాజా కథ గురించి ఆయన చెప్పారు. కానీ అప్పుడు నిర్మాతగా చెబుతున్నారని అనుకున్నా.. కానీ దర్శకుడిగా కథ చెబుతున్నారని తరువాత అర్థమైంది. కథ చాలా బాగుంది. సినిమా బాగా వచ్చింది. మీడియా, ఆడియెన్స్ అందరూ సినిమాకు సపోర్ట్ అందించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
కెమెరామెన్ రాహుల్ శ్రీ వాత్సవ్ మాట్లాడుతూ .. ‘రా రాజా సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ చిత్రం చాలా బాగా వచ్చింది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.