
తెలంగాణ బీజేపీ(Telangana BJP)లో లుకలుకలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఈ మేరకు MLC అభ్యర్థి విషయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy)పై ఆపార్టీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) ఆగ్రహం వ్యక్తం చేశాడు. బీజేపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి(MLC Candidate of BJP Local Bodies)గా గౌతమ్ రావు(Gautam Rao)ను ప్రకటించడంపై రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు మీ పార్లమెంటు నియోజకవర్గానికే పదవులు ఇస్తారా? అని కిషన్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. హైదరాబాద్(Hyderabad)లో ఇంకా BJP అభ్యర్థులే లేరా? అని నిలదీశారు.
సీనియర్ నాయకులు, కార్యకర్తలు కనిపించట్లేదా?
అటు పార్టీ అధిష్ఠానానికి సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. మీకు గులాంగిరి చేసేవారికే పదవులు, టిక్కెట్లు(Tickets) ఇవ్వడమేమిటని నిలదీశారు. మిగతా నేతలను పక్కన పెడుతున్నారని ఆరోపించారు. కాగా, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును అధిష్ఠానం ప్రకటించింది. మే 1వ తేదీతో ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు(Prabhakar Rao) పదవీకాలం ముగియనుంది. దీంతో ఈ స్థానానికి ఏప్రిల్ 23న పోలింగ్(Polling), 25న ఓట్ల లెక్కింపు(Counting) నిర్వహించనున్నారు.