సూపర్‌స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) 50వ పుట్టినరోజు (ఆగస్టు 9) సందర్భంగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli) బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ప్రిన్స్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్న ‘SSMB29’ సినిమాకు సంబంధించి కీలక అప్డేట్(Update) ఇచ్చారు. ఈ పాన్-వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం నుంచి రాజమౌళి ఓ ఫొటోను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో మహేశ్ మెడలో త్రిశూలం, నంది లాకెట్(Trident and Nandi locket)తో రక్తం కారుతున్న విజువల్ అభిమానుల్లో హైప్ పెంచింది. నవంబర్ 2025లో గ్రాండ్ ఫస్ట్ రివీల్(The First Reveal in November 2025) ఉంటుందని, సినిమా కథ విస్తృతమైనదని, సాధారణ ప్రమోషన్(Promotions)తో న్యాయం చేయలేమని ట్వీట్‌లో పేర్కొన్నారు.
The First Reveal in November 2025… #GlobeTrotter pic.twitter.com/MEtGBNeqfi
— rajamouli ss (@ssrajamouli) August 9, 2025
కాగా ఈ చిత్రం ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ‘ఇండియానా జోన్స్(Indiana Jones)’ స్టైల్‌లో రూపొందుతున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రియాంకా చోప్రా(Priyanka Chopra), పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran), మాధవన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్‌లో టాంజానియాలో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. సుమారు 1200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027లో విడుదల కానుంది. మహేశ్ రెమ్యునరేషన్(Mahesh Remuneration) తీసుకోకుండా లాభాల్లో వాటా తీసుకుంటున్నట్లు సమాచారం.






