సూపర్ రజినీకాంత్(Rajinikanth) 2023లో ‘జైలర్(Jailer)’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత చేసిన లాల్ సలామ్, వెట్టైయాన్(Vettayan) బాక్సాఫీసు వద్ద మెప్పించలేకపోయాయి. అయినప్పటికీ సూపర్ స్టార్ హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలతో పోటీపడుతున్నారు. ఇక ఇటీవల ఆయన ‘కూలీ(Coolie)’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘కూలీ’ థియేటర్స్‌లో మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. తాజాగా ‘కూలీ’ (coolie) ఊహించని ఇప్పటి వరకూ ₹223.24 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా రూ,433 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డు సాధించింది.

ఎనిమిది రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే..
☛ 1వ రోజు : రూ.65 కోట్లు
☛ 2వ రోజు : రూ.54.75 కోట్లు
☛ 3వ రోజు : రూ.39.5
☛ 4వ రోజు : రూ.35.25
☛ 5వ రోజు : రూ.12
☛ 6వ రోజు : రూ.9.5 కోట్లు
☛ 7వ రోజు : రూ.6.59 కోట్లు
☛ 8వ రోజు : రూ.0.19 కోట్లు

కీలక పాత్రల్లో స్టార్ నటులు
మొత్తం 223.24 కోట్లు రాబట్టినట్లు తెలుసుకున్న సూపర్ స్టార్ అభిమానులు(Superstar Fans) ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, ఈ సినిమాలో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) విలన్‌గా నటించగా.. ఉపేంద్ర(Upendra), సౌబిన్ షాహిర్, శృతి హాసన్(Shruti Haasan) కీలక పాత్రలో కనిపించారు. అంతేకాకుండా టాలీవుడ్ స్టార్ బ్యూటీ పూజా హెగ్డే(Pooja Hegde) సూపర్ స్టార్ సరసన ఐటమ్ సాంగ్‌లో స్టెప్పులేసింది. సన్ పిక్చర్స్(Sun Pictures) బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా కలెక్షన్స్(Collections)తో బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యేలా కనిపిస్తోంది.
#Coolie 7 Days WW Box office collections report:
Tamilnadu – 113Cr
Kerala – 23Cr
Karnataka – 38Cr
Telugu States – 59Cr
North India – 35CrIndia Gross: 268Cr
Overseas: 165CrWW Gross: ₹433Cr 🔥💥😎@rajinikanth #Jailer2 pic.twitter.com/wZBRBK7krI
— Naveen Anirudh 🇮🇳 (@NaveenAnirudh16) August 21, 2025






