Mana Enadu: తమిళ సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ (Rajinikanth) ప్రధాన పాత్రలో దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ (Coolie)’. టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రుతిహాసన్, సత్యరాజ్, ఉపేంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓనం పండగను పురస్కరించుకుని మేకర్స్ సెట్స్‌లో సెలబ్రేషన్స్ చేశారు. ఓనమ్ స్పెషల్
ఈ సందర్భంగా రజనీకాంత్ ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. తనదైన శైలిలో స్టెప్పులు వేసి అలరించారు. పంచెకట్టులో తలైవా తన స్వాగ్తో అదరగొట్టారు. చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. తలైవా (Thalaiva Dance Video)నా మజాకా అంటా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అరవై ఏళ్లు దాటినా రజనీ స్టైల్, స్వాగ్ మాత్రం తగ్గలేదంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుం ఈ వీడియో బాగా ట్రెండ్ అవుతోంది.
‘తలైవర్ 171 (Thalaivar 171 Coolie)’గా రానున్న ఈ చిత్రాన్ని సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికై టైటిల్ రివీల్ వీడియోతో పాటు రజనీ న్యూ లుక్కు సంబంధించిన పోస్టర్, అభిమానుల్లో ఈ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేసింది. ఇందులో తలైవర్ లుక్ మరింత కొత్తగా ఉండనుందట. అక్రమ రవాణా మాఫియా బ్యాక్డ్రాప్తో ఈ చిత్రం రూపొందుతున్నట్టు సమాచారం.
మరోవైపు రజనీకాంత్ వరుస సినిమాలు చేస్తూ జోరు సాగిస్తున్నారు. దసరా పండుగకు ‘వేట్టయాన్ (Vettaiyan)’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించనున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’తో సందడి చేస్తారు. మరోవైపు జైలర్ 2 (Jailer2) పనుల్లో బిజీగా ఉన్నారు. వరుసగా మూడు సినిమాలతో బిజీగా ఉండగానే మరో యంగ్ డైరెక్టర్కు తలైవా సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
‘కర్ణన్’, ‘మామన్నన్’ చిత్రాలతో ఆడియెన్స్ను అలరించిన దర్శకుడు మారి సెల్వరాజ్ (Mari Selvaraj)తో తలైవా ఓ సినిమా చేయబోతున్నారట. తన సినిమాలు చూసి నచ్చి, తనతో ఓ చిత్రంలో నటించాలనుకుంటున్నట్లు స్వయంగా రజనీకాంత్ ఫోన్ చేసి చెప్పినట్లు సెల్వరాజ్ తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా కథపై చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఇది ఓకే అయితే ఈ ఏడాది రజనీకాంత్ నుంచి నాలుగు చిత్రాలు రాబోతున్నట్లు సమాచారం.