Mana Enadu : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా జైభీమ్ ఫేం టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘వేట్టయన్ (Vettaiyan The Hunter). ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్ (Vettaiyan Trailer) రిలీజ్ చేసింది. రజినీకాంత్ ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ థ్రిల్లింగ్ గా ఉంది. ఈ సినిమాలో తలైవాతో పాటు అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి (Rana Daggubati), ఫాహద్ ఫాజిల్, మంజూ వారియర్, దుషారా విజయన్, రితికా సింగ్ కీలక పాత్రల్లో నటించారు.
తమిళ డబ్బింగ్ మూవీగా తెలుగులోనూ వేట్టయన్ సినిమా విడుదలవుతోంది. ఈ చిత్రంలో రజినీ కాంత్ (Rajinikanth) పోలీసు ఆఫీసర్ గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్ న్యాయమూర్తిగా కనిపించారు. చట్టం, న్యాయం, ధర్మానికి మధ్య జరిగే సంఘర్షణగా ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ట్రైలర్ ఓపెనింగ్ లోనే ఓ అమ్మాయి దారుణంగా హత్యాచారానికి గురైనట్లు చూపించారు. ఈ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ నేపథ్యంగా ఈ సినిమా సాగనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
అయితే ఈ ఎన్ కౌంటర్ విషయంలో పోలీసు అధికారి రజినీ కాంత్, జడ్జి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నట్లు ట్రైలర్ లో చూడొచ్చు. న్యాయం ఆలస్యం కావొచ్చు కానీ కచ్చితంగా బాధితులకు న్యాయం చేకూరుతుందనే పంథాలో బిగ్ బీ ఉండగా.. తప్పు చేసిన వాడిని తన నుంచి తప్పించడం ఎవరి తరం కాదంటూ బిగ్ బీకి సవాల్ చేసే పాత్రలో తలైవా కనిపించారు.
ఇక ఈ ట్రైలర్ రానా, ఫహాద్ (Fahad Fasil), మంజు వారియర్ కూడా కీలక పాత్రల్లో కనిపించారు. మొత్తానికి ఈ సినిమా ప్రస్తుత సమాజంలో అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలు, వాటి పట్ల పోలీసుల ప్రవర్తన, బాధితులకు న్యాయం చేకూరే ప్రక్రియపై ఆధారపడి ఉన్నట్లు సమాచారం. అక్టోబర్ 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల అవ్వనుంది. ఈ చిత్రానికి యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు.
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…