
బాలీవుడ్ క్రేజీ ఫ్రాంఛైజీస్ లలో రేస్ (RACE) సిరీస్ ఒకటి. ఇప్పటికే ఈ ఫ్రాంఛైజీ నుంచి (రేస్, రేస్-2, రేస్-3) సినిమాలు వచ్చాయి. ఇందులో ఫస్ట్ రెండు భాగాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక సల్మాన్ ఖాన్ నటించిన రేస్-3 మాత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ఇక ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీలో నాలుగో మూవీ రేస్-4 తీసుకొచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ మూవీతో రేస్ ఫ్రాంఛైజీలోకి సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) రీ-ఎంట్రీ ఇస్తున్నాడు. పార్ట్-3లో మిస్ అయినా పార్ట్-4లో మాత్రం భాగం కాబోతున్నాడు.
హీరోయిన్లకూ యమ క్రేజ్
సైఫ్ అలీఖాన్, సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) కాంబోలో రేస్-4 (RACE 4) వస్తోంది. సిద్ధూ ఈ సినిమాతో రేస్ ఫ్రాంఛైజీలో భాగం కాబోతున్నాడు. ఇక రేస్ ఫ్రాంఛైజీ అంటే హీరోలే కాదు హీరోయిన్లకు కూడా సూపర్ క్రేజ్ ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన మూడు సినిమాల్లో కత్రినా (Katrina Kaif), బిపాషా, అమీషా, దీపిక, జాక్వెలిన్ వంటి బ్యూటీస్ సందడి చేశారు. ఇక పార్ట్-4లోనూ ఇద్దరు బ్యూటీస్ కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
రేస్-4లో రకుల్
ఈ ఇద్దరు హీరోయిన్లలో ఒకరు ముంజ్యతో సూపర్ హిట్ కొట్టిన శార్వరీ వాఘ్, మరొకరు మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ (Manushi Chillar). ఈ ఇద్దరూ రేస్-4లో భాగం కానున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. కానీ తాజాగా ఈ ఫ్రాంఛైజీలో టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాన్ నడుస్తోంది. దాదాపుగా ఈ భామ ఈ చిత్రంలో కన్ఫామ్ అయిందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ బ్యూటీ రాకతో ఈ ఫ్రాంఛైజీ నుంచి శార్వరీ ఔట్ అవుతుందో లేదా మానుషీ వెళ్లిపోతుందో. లేక ముగ్గురు హీరోయిన్లు ఉంటారో చూడాల్సి ఉంది.