
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన (Buchbabu Sana) కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ‘RC16’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇది స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల క్రికెట్ నేపథ్యంలో వచ్చే సీన్లు షూటింగ్ చేసినట్లు సమాచారం. క్రికెట్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్ని ప్రధానంగా రామ్ చరణ్-దివ్యేందుల మధ్య చిత్రీకరించినట్లు తెలిసింది.
చెర్రీ-శివన్న కుస్తీ ఫైట్
అయితే ఈ సినిమాలో కుస్తీ పోటీల (Wrestling) నేపథ్యంలోనూ కొన్ని సీన్లు ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. ఈ సీన్లు ఫ్లాష్ బ్యాక్ లో రానున్నట్లు తెలిసింది. అయితే ఈ సన్నివేశాలను రామ్ చరణ్, మరో స్టార్ హీరో మధ్య తెరకెక్కించాలని బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నాడట. ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్. చెర్రీ-శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) మధ్య కుస్తీ సీన్లను కాకినాడలో షూట్ చేయనున్నట్లు సమాచారం.
కాకినాడలో చెర్రీ కుస్తీ
శివ రాజ్ కుమార్ ఇటీవలే క్యాన్సర్ బారిన పడి అమెరికాలో చికిత్స పొంది కోలుకున్న తర్వాత స్వదేశానికి వచ్చారు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. మరికొన్ని రోజుల పాటు ఆయనకు బ్రేక్ అవసరం. ఆయన పూర్తిగా కోలుకునే వరకు షూటింగులో పాల్గొనరు. అందుకు ఎన్ని రోజులు పడుతుందన్న దానిపై క్లారిటీ లేదు. అయితే కుస్తీకి సంబంధించిన మరికొన్ని సీన్లను అప్పటి వరకు కాకినాడలో షూట్ చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో జాన్వీకపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.