క్వీన్‌ ఎలిజెబెత్‌-2 తర్వాత రామ్ చరణే.. గ్లోబల్ స్టార్ మరో అరుదైన ఘనత

Mana Enadu : గ్లోబల్ స్టార్ హీరో రామ్‌చరణ్‌ (Ram Charan) మరో అరుదైన ఘనత సాధించాడు. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకుగానూ సింగపూర్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం (Ram Charan wax statue) కొలువుదీరనుంది. అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ కార్యక్రమంలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడగా చెర్రీ.. మైనపు విగ్రహానికి సంబంధించిన కొలతలను మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం ప్రతినిధులు తీసుకున్నారు.

రామ్ చరణ్ అరుదైన ఘనత

2025 వేసవి సమయానికి చరణ్‌ విగ్రహాన్ని సందర్శన కోసం అందుబాటులోకి తీసుకురానున్నట్లు మ్యూజియం ప్రతినిధులు తెలిపారు. ఇక మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఉన్న ‘ఐఐఎఫ్‌ఏ జోన్‌(IIFA Zone)’లో ఇప్పటికే బాలీవుడ్ బాద్ షా షారుక్‌ ఖాన్, బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌(Amitab Bachchan), కాజోల్‌, కరణ్‌ జోహార్‌ల మైనపు విగ్రహాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే చెర్రీతో పాటు తన పెట్ డాగ్ రైమ్‌ (Ryme) కూడా మైనపు విగ్రహంలో భాగస్వామి కానుంది. క్వీన్‌ ఎలిజిబెత్‌-2 తర్వాత పెంపు జంతువుతో మైనపు విగ్రహంగా కనిపించనున్న వ్యక్తిగా రామ్‌చరణ్‌ అరుదైన ఘనత సాధించాడు.

ఇది కలలో కూడా ఊహించలేదు

ఈ సందర్భంగా రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ.. ‘‘సింగపూర్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌లో (Madame Tussauds Singapore) సూపర్ స్టార్స్ సరసన నా విగ్రహం కూడా చేరడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఇది కల్లో కూడా ఊహించలేదు. కష్టం, సినిమాపై నాకున్న ప్యాషన్‌ వల్లే ఈ గుర్తింపు సాధ్యమైంది. రైమ్ (Ram Charan Dog Rhyme) నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది. నా వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని మిళితం చేస్తూ విగ్రహం రావడం ప్రత్యేకంగా ఉంది’ అని అన్నాడు.

Share post:

లేటెస్ట్