Ranya Rao: నటి రన్యారావుకు ఏడాది జైలు.. శిక్ష ఖరారు చేసిన హైకోర్టు

బంగారం అక్రమ రవాణా కేసు(gold smuggling case)లో అరెస్టయిన కన్నడ నటి రన్యారావుకు (Ranya Rao) కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఏడాది జైలు శిక్ష విదిస్తూ బెంగళూరు కోర్టు గురువారం తీర్పునిచ్చింది. విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ రన్యారావు అధికారులకు పట్టుబడింది. దీంతో విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధక చట్టం (Caffifosa’s Law) కింద ఆమెపై కేసు నమోదైంది. సాక్షాధారాలు పరిశీలించిన కోర్టు తాజాగా రన్యారావుతోపాటు ఆమెకు సహకరించిన తరుణ్ రాజు, సాహిల్ జైన్కు కూడా జైలు శిక్ష విధించింది.

14.7 కిలోల బంగారంతో బడ్డబడ్డ రన్య

దుబాయ్ నుంచి బంగారాన్ని రన్యారావు అక్రమంగా తరలిస్తూ (Gold smuggling) ఈ ఏడాది మార్చిలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. ఆమె వద్ద 14.7 కిలోల బంగారాన్ని డీఆర్ఎ అధికారులు స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు. ఆపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) పీఎంఎల్ఎ (మనీలాండరింగ్ నిరోధక చట్టం) కింద కేసు నమోదు చేసింది. గోల్డ్ స్మగ్లింగ్ సిండికేట్లో ఆమె పాత్ర ఉన్నట్లు గుర్తించింది. మనీలాండరింగ్ కేసులో భాగంగా ఆమెకు చెందిన రూ.34 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

లభించని బెయిల్.. ఆపై ఎదురుదెబ్బ

రన్యారావుకు స్పెషల్ న్యాయస్థానం ప్రత్యేక షరతులతో బెయిల్ మంజూరు చేసినా జైలు నుంచి విడుదల కాలేదు. DRI అధికారుల లోపాల కారణంగా ఆమెకు డిఫాల్ట్ బెయిల్ లభించినప్పటికీ కాఫీఫోసా చట్టం వల్ల విడుదల కాలేదు. దీంతో ఆమె తల్లి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కానీ, కోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *