నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రాల్లో ‘ది గర్ల్ ఫ్రెండ్ (The Girlfriend)’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతుండగా, టాలెంటెడ్ యాక్టర్ దీక్షిత్ శెట్టి కథానాయకుడిగా నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాతలుగా ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడి వ్యవహరిస్తున్నారు.
Romance, Rhythm, and Raw Emotion 🎼#TheGirlfriend shoot in full swing with a peppy and soulful song called #Nadhive being picturized on @iamRashmika & @Dheekshiths ❤🔥#TheGirlfriend Release Date Announcement & First Single Coming Soon ✨@HeshamAWMusic‘s soulful music will… pic.twitter.com/AgeLF0sOJk
— Geetha Arts (@GeethaArts) July 5, 2025
ఇక తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్(Crazy Update)ను విడుదల చేశారు. సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. “రొమాన్స్, రిథమ్ & రా ఎమోషన్.. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ షూటింగ్ పూర్తి స్థాయిలో జరుగుతోంది. #నాదివే అనే ఉల్లాసభరితమైన పాటను రష్మిక – దీక్షిత్ కలిసి అందించనున్నారు. విడుదల తేదీ ప్రకటనతో పాటు ఫస్ట్ సింగిల్ కూడా త్వరలోనే విడుదల కానుంది” అని ప్రకటించారు.
ఈ అప్డేట్తో పాటు విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా రోజులుగా మూవీ నుంచి ఏ అప్డేట్ రాక పోవడంతో నిరాశకు గురైన ఫ్యాన్స్ ఇప్పుడు ఈ సాంగ్ న్యూస్‌తో ఎంతో ఆనందంగా ఉన్నారు. రష్మిక నటించిన ఈ మ్యూజికల్ లవ్ స్టోరీ నుంచి వచ్చే పాట ఏ స్థాయిలో అలరిస్తుందో అన్న ఆసక్తి ఇప్పటికే మొదలైంది.






