
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానేవచ్చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) అట్టహాసంగా ప్రారంభమైంది. కోల్‌కతా(Kolkata)లోని ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) టాస్ గెలిచింది. ఆ జట్టు కెప్టెన్ రజత్ పాటీదార్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. అంతకుముందు IPL 18 సీజన్ ప్రారంభ వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. కాగా ఈ మ్యాచుకు భారీగా ప్రేక్షకులు హాజరయ్యారు.
పుష్ప-2 సినిమాలోని పాటతో ఆరంభం
తొలుత దేశభక్తి గీతాన్ని ఆలపించిన శ్రేయా ఘోషల్(Shreya Goshal).. విద్యాబాలన్ చిత్రం భూల్ భూలైయాలోని పాటతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. దీని తరువాత.. సంజు చిత్రంలోని కర్ హర్ మైదాన్ ఫతే పాటతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సూపర్ హిట్ చిత్రమైన Pushpa-2లోని ‘చూసేకి అగ్గి రవ్వలా…’ పాటను ఆలపించింది. ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో ఈడెన్ గార్డెన్స్ స్టేడియం మారుమోగింది. ప్రముఖ గాయకుడు, రాపర్ కరణ్ ఔజ్లా(Rapper Karan Aujla) ఐపీఎల్ ప్రారంభోత్సవంలో ప్రదర్శన ఇచ్చారు. రాపర్ కరణ్ ఔజ్లా తన గాత్రంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. అనంతరం డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కు ఆ జట్టు యజమాని షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు.
జట్ల వివరాలు ఇవే..
కోల్‌కతా నైట్ రైడర్స్: క్వింటన్ డి కాక్(WK), వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే(C), రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్(WK), రజత్ పాటిదార్(C), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రసిఖ్ దార్ సలామ్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్