IND vs NZ 2nd Test: బెడిసి కొట్టిన భారత్ ప్లాన్.. కివీస్‌కు భారీ లీడ్

Mana Enadu: పుణే వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న సెకండ్ టెస్టు‌లో న్యూజిలాండ్(New Zealand) ప‌ట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి రెండో ఇన్నింగ్స్‌(second innings)లో 5 వికెట్లు కోల్పోయి 198 ప‌రుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (9), టామ్ బ్లండెల్ (30) క్రీజులో ఉన్నారు. టీమ్ఇండియా బౌల‌ర్ల‌లో వాషింగ్ట‌న్ సుంద‌ర్ నాలుగు వికెట్లు తీశాడు. అశ్విన్(Ashwin) ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు. భార‌త్(India) తొలి ఇన్నింగ్స్‌లో 156 ఆలౌట్ అయింది. ప్ర‌స్తుతం న్యూజిలాండ్ 301 ప‌రుగుల ఆధిక్యంలో కొన‌సాగుతోంది. కాగా ఈ టెస్టుకు స్పిన్ ట్రాక్‌ను సిద్ధం చేపించిన భారత్.. అదే స్పిన్ ఉచ్చులో బిగుసుకుపోంది. ఫలితంగా కివీస్ అప్పర్ హ్యాండ్ సాధించింది.

 140 పరుగులకే 9 వికెట్లు డౌన్

అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 156 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌కు 103 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. 16/1 స్కోరుతో ఆట ప్రారంభించిన రోహిత్ సేన చివరి 9 వికెట్లను 140 పరుగులలోనే కోల్పోయింది. రవీంద్ర జడేజా(Ravindra jadeja) ఒక్కడే అత్యధికంగా 38 పరుగులు చేశాడు. జైస్వాల్(30), శుభ్‌మన్ గిల్ (30) రన్స్ చేశారు. కివీస్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ 53/7, ఫిలిప్స్ 26/2, సౌథీ 18/1తో సత్తా చాటారు. అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌట్ అయింది. వాషింగ్టన్ సుందర్(Washington sundar) ఏడు వికెట్లు కూల్చాడు.

 బలంగా పుంజుకుంటేనే..

కాగా మూడు టెస్టుల సిరీస్‌(Three Test series)లో భాగంగా న్యూజిలాండ్ మొదటి మ్యాచ్‌లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. బెంగళూరు చిన్నస్వామి వేదికగా జరిగిన తొలి టెస్ట్(Bengaluru Test) మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. 36 ఏళ్ల తర్వాత భారత్ గడ్డపై 8 వికెట్ల తేడాతో కివీస్ నెగ్గింది. తాజాగా రెండో టెస్టులోనూ భారత్ పేలవ ప్రదర్శనతో పర్యాటక జట్టు పైచేయి సాధించింది. రేపు వీలైనంత త్వరగా కివీస్ ఆలౌట్ చేసి.. అటు బ్యాటింగ్‌లోనూ భారత్ బలంగా పుంజుకుంటేనే ఈ టెస్ట్‌లో గెలుస్తుంది. లేకపోతే తొలి టెస్టు మాధిరి ఈ మ్యాచు‌లోనూ ఘోర పరాజయం తప్పదు.

Share post:

లేటెస్ట్