
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithin) బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో శ్రీలీల (Sreeleela) ఫీమేల్ లీడ్ గా నటించిన ‘రాబిన్ హుడ్ (Robinhoof)’ సినిమా మార్చి 28వ తేదీన థియేటర్లలోకి రానుంది. ఇక ఈ సినిమా తర్వాత నితిన్ వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ఈ చిత్రం తర్వాత బలగం ఫేం వేణు యెల్దండితో కలిసి ఎల్లమ్మ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా మొదట సాయిపల్లవిని ఓకే చేశారు. ఆమె కూడా ఇందులో హీరోయిన్ పాత్ర బలంగా ఉండటంతో ఓకే చెప్పినట్లు తెలిసింది.
సాయిపల్లవి ఔట్.. కీర్తి ఇన్
అయితే తాజాగా సాయిపల్లవి ఎల్లమ్మ (Yellamma) మూవీ నుంచి ఔట్ అయినట్లు సమాచారం. ఈ సినిమా షూటింగు జూన్, జులై సమయంలో జరగనుండగా.. ఆ సమయంలో సాయిపల్లవి (Sai Pallavi) డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని రాబిన్ హుడ్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నితిన్ చెప్పాడు. అయితే సాయిపల్లవి ఔట్ కావడంతో డైరెక్టర్ వేణు ఇప్పుడు మరో టాలెంటెండ్ హీరోయిన్ కోసం వెతుకుతున్నారట.
రష్మిక OR సమంత
ఇందులో భాగంగా ఎల్లమ్మ హీరోయిన్ గా మహానటి ఫేం కీర్తి సురేశ్ (Keerthy Suresh) అయితే బాగుంటుందని వేణు భావిస్తున్నారట. ఆమెకు కథ కూడా చెప్పినట్లు తెలిసింది. ఒకవేళ కీర్తి ఈ చిత్రం చేయడానికి నో చెబితే.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna)ను కూడా సంప్రదించాలని చూస్తున్నాడట. అయితే ప్రస్తుతం రష్మిక బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఒకవేళ ఆమె డేట్స్ దొరకకపోతే స్టార్ హీరోయిన్ సమంత(Samantha)ను కూడా సంప్రదించాలని యోచిస్తున్నారట. అయితే సామ్ చాలా కాలంగా తెలుగు సినిమాలు చేయడం లేదు. మరి ఈ చిత్రానికి ఓకే చెబుతుందో లేదో.