Saif Ali Khan: సైఫ్‌ శరీరంపై 6 కత్తిపోట్లు.. ఘనటపై స్పందించిన ఎన్టీఆర్

బాలీవుడ్(Bollywood) నటుడు సైఫ్ అలీఖాన్‌(Saif Ali Khan)పై కత్తితో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ముంబై బాంద్రా(Mumbai Bandra)లోని ఆయన నివాసంలోకి ఓ దొంగ చొరబడి సైఫ్‌పై కత్తితో దాడి(Knife Attack) చేసినట్లుగా తెలుస్తోంది. గురువారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో సైఫ్ తన కుటుంబ సభ్యులతో కలిసి నిద్రిస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ సమయంలో దొంగతో జరిగిన ఘర్షణలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన శరీరంపై 6 చోట్ల కత్తిగాట్లు కావడంతో వెంటనే నవీముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు.

సైఫ్ గాయంపై స్పందించిన లీలావతి ఆస్పత్రి

ఈ ఘటనపై బాంద్రా పోలీసులు(Bandra Police) కేసు నమోదు చేశారు. దుండగుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఇదిలా ఉండగా లీలావతి ఆసుపత్రి(Lilavati Hospital) యాజమాన్యం సైఫ్ గాయంపై స్పందించింది.‘ ఆయనపై దొంగ కత్తితో దాడిచేశాడని 3.30 గంటల సమయంలో ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయి. అందులో రెండు కత్తిపోట్లు లోతుగా దిగాయి. ఒకటి వెన్నెముకకు దగ్గరల్లో దిగింది. న్యూరోసర్జన్ నితిన్ డాంగే, కాస్మొటిక్ సర్జన్ లీనా జైన్ ఆయనకు సర్జరీ(Surgery) చేస్తున్నారు. శస్త్రచికిత్స పూర్తయిన తర్వాతే ఆయన ఆరోగ్యంపై మరింత సమాచారం ఇస్తాం’’ అని తెలిపింది.

ఇది తెలుసుకొని దిగ్భ్రాంతికి గురయ్యాం..

ఇదిలా ఉండగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడిపై యంగ్ టైగర్ NTR స్పందించారు. ‘సైఫ్‌పై జరిగిన దాడి గురించి తెలిసి షాక్‌కు గురయ్యా. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా’ అని NTR ట్వీట్ చేశారు. అటు ‘దేవర’ టీమ్(Devara Team) సైతం ఈ ఘటనపై స్పందించింది. ‘ఇది తెలుసుకొని దిగ్భ్రాంతికి గురయ్యాం. త్వరగా కోలుకోండి సైఫ్ సార్’ అని పేర్కొంటూ ట్వీట్ చేస్తోంది. కాగా సైఫ్ అలీఖాన్ ‘దేవర(Devara Movie)’ సినిమాలో భైరా(Bhaira) పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

Related Posts

Hansika: బాంబే హైకోర్టును ఆశ్రయించిన హన్సిక.. ఎందుకో తెలుసా?

తనపై నమోదైన గృహ హింస కేసును కొట్టివేయాలంటూ హీరోయిన్ హన్సిక (Hansika) బాంబే హైకోర్టు(High Court of Bombay)ను ఆశ్రయించింది. ఈ మేరకు గురువారం క్వాష్‌ పిటిషన్‌(Quash petition) దాఖలు చేసింది. తన సోదరుడి భార్య ఫిర్యాదుతో హన్సికతో సహా ఆమె…

బెట్టింగ్ యాప్స్ ఇష్యూ.. వారిని అరెస్ట్ చేయకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా: KA పాల్

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్(Betting Apps Issue) వ్యవహారం సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల(Cine Celebrities)పై కేసు నమోదు కాగా.. నిన్న రామారావు అనే వ్యక్తి నందమూరి బాలకృష్ణ(Balakrishna), ప్రభాస్(Prabhas), గోపీచంద్‌పై ఫిర్యాదు చేశాడు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *