
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్(Salman Khan), ప్రముఖ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్(A.R. Murugadoss) కాంబోలో తెరకెక్కిన మూవీ ‘సికిందర్(Sikindar)’. ఈ మూవీలో సల్మాన్‌కు జోడీగా సక్సెస్‌ఫుల్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) నటిస్తోంది. సత్యరాజ్, కాజల్ అగర్వాల్(Kajal Agarwal) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా మురుగదాస్ చాలా గ్యాప్ తర్వాత ఈ మూవీని తెరకెక్కించాడు. అటు సల్మాన్ ఖాన్ కూడా సౌత్ఇండియన్ డైరెక్టర్‌తో మూవీ చేయడంతో భారీ హైప్ నెలకొంది. కాగా ఈ మూవీ మార్చి 30న థియేటర్లలోకి రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్(Trailer)ను విడుదల చేశారు.
ఫుల్ లెంగ్త్ యాక్షన్ పక్కా
ఇక తాజా ట్రైలర్‌లో సల్మాన్ వింటేజ్ లుక్‌లో స్టైలిష్ లుక్(Stylish Look)లో కనిపించాడు. సల్మాన్ ఫుల్ లెంగ్త్ యాక్షన్ సీన్లతో ట్రైలర్‌ను నింపేశారు. అటు మాస్ సీన్లతో పాటు కొన్ని రొమాంటిక్ లవ్ సీన్లను కూడా చూపించాడు డైరెక్టర్ మురుగదాస్. గ్యాప్ ఎక్కువైనా మూవీ డైరెక్షన్లతో తన మార్క్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు మురుగదాస్. పెద్దగా గ్రాఫిక్స్, VFX జోలికి పోకుండా రియాల్టీకి దగ్గరగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ సల్మాన్ భాయ్ మూవీ ట్రైలర్‌ను చూసేయండి.