
కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ (AR Murugadas) బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)తో సికందర్ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. జయహో తర్వాత ఈ కాంబోలో వస్తున్న చిత్రమిది. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాది రంజాన్ కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ టీజర్ విడుదల చేసింది. ఫుల్ ఆన్ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ టీజర్ సాగింది. ఇందులో సల్మాన్ ఖాన్ తన ఫైట్స్ తో అదరగొట్టాడు.
సికందర్ టీజర్ రిలీజ్
”నాన్నమ్మ అతడికి సికందర్ అని పేరు పెట్టింది. తాత ఏమో సంజయ్ అని పెట్టాడు. కానీ ప్రజలు మాత్రం అతడిని రాజాసాబ్ అని పిలుస్తారు అంటూ టీజర్ మొదలైంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో రాబోతున్న ఈ టీజర్ చాలా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సినిమాను నడియాడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సత్యరాజ్ (Satya Raj) విలన్‌గా నటిస్తున్నాడు.