టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విజయ్ దేవరకొండ పర్సనల్ విషయాలపై సమంత ఓపెన్ అయింది. ఆయనకు కాబోయే వైఫ్ ఎలా ఉండాలో చెబుతూ సామ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మొన్నటికి మొన్న ఖుషి మ్యూజికల్ నైట్ లో విజయ్ దేవరకొండ- సమంత కెమిస్ట్రీ చూసి అంతా ఫిదా అయ్యారు. వేదికపై రొమాంటిక్ స్టెప్స్ తో ఆకట్టుకుంది ఈ జోడీ. ఇక ఈ ఈవెంట్ ఫొటోస్ అయితే నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే పలు ప్రమోషనల్ ఈవెంట్స్ చేస్తున్న విజయ్, సమంత.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఒకరి ఇష్టాలను మరొకరు చెప్పారు. విజయ్ దేవరకొండ జీవిత భాగస్వామి ఎలా ఉండాలనే దానిపై సమంత ఓపెన్ అయింది.
విజయ్ దేవరకొండకు కాబోయే వైఫ్ చాలా సాధారణంగా ఉండాలని, ఫ్యామిలీతో కలిసిపోవాలని సమంత చెప్పింది. దీనికి విజయ్ కూడా ఎస్ అనడం విశేషం. అదేవిధంగా విజయ్ ఫోన్ కాల్స్ చాలా తక్కువగా మాట్లాడతాడని, మెసేజెస్ ఎక్కువగా చేస్తుంటాడని సామ్ చెప్పింది.
మరోవైపు విజయ్ దేవరకొండ కూడా సమంత గురించి కొన్ని విషయాలు చెప్పారు. రాహుల్ రవీంద్రన్, చిన్మయి, నీరజ కోన, మేఘన.. వీళ్ళు సమంత బెస్ట్ ఫ్రెండ్స్ అని, ఎంత కోపంలో ఉన్నా కూడా సమంత నోట అసభ్యకర మాటలు అస్సలు రావని విజయ్ దేవరకొండ అన్నారు. ఇక వీళ్లిద్దరి ఖుషి సినిమా విషయానికొస్తే.. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అటు సమంతకు, ఇటు విజయ్ దేవరకొండకు ఈ ఖుషీ సినిమా ఎంతో కీలకంగా మారింది.
రీసెంట్ గా షూటింగ్ ఫినిష్ చేసి ప్రమోషనల్ కార్యక్రమాలు చేపడుతున్న మేకర్స్.. ఎప్పటికప్పుడు అప్ డేట్స్ వదులుతూ ఈ సినిమాపై హైప్ పెంచేశారు. సెప్టెంబర్ 1న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.