
యంగ్ హీరో సందీప్ కిషన్(Sandeep Kishan) ప్రస్తుతం వరుస హిట్స్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఊరుపేరు భైరవకోన, రాయన్ సినిమాల విజయం తర్వాత ఇప్పుడు ‘మజాకా(MAZAKA)’ సినిమాతో రాబోతున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్(AK Entertainments), హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా నిర్మాణంలో డైరెక్టర్ త్రినాథరావు(Director Trinatha Rao) దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకి స్టార్ రైటర్ ప్రసన్న బెజవాడ స్టోరీ, లిరిక్స్ అందిస్తున్నారు. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది కామెడియన్ పాత్రలో మెప్పించాడు.
మన్మథుడు హీరోయిన్ రీఎంట్రీ
కాగా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీలో రీతూవర్మ(Ritu Varma) హీరోయిన్‌గా నటిస్తుండగా మన్మథుడు హీరోయిన్ అన్షు అంబానీ(Anshu Ambani) ఈ మూవీతో రీఎంట్రీ ఇస్తోంది. రావు రమేష్(Rao Ramesh) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే టీజర్(Teaser), సాంగ్స్ (Songs)రిలీజ్ చేసి మంచి హైప్ నెలకొల్పారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న రిలీజ్ కానుంది. లియోన్ జేమ్స్(Leon James) మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమా ట్రైలర్(Trailer)ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. మీరు కూడా ఈ ట్రైలర్ చూసేయండి..