భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా(Sania Mirza) మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల సోషల్ మీడియా(SM)లో వైరల్ అయిన కాఫీ డేట్ ఫొటోలు(Coffee date photos) ఆమె రెండో పెళ్లి ఊహాగానాలకు కారణమయ్యాయి. 2024లో పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్(Shoaib Malik)తో 14 సంవత్సరాల వివాహ బంధం ముగిసిన తర్వాత, సానియా దుబాయ్‌లో తన కుమారుడు ఇజ్హాన్ మీర్జా మాలిక్(Izhan Mirza Malik)తో నివసిస్తోంది. ఈ విడాకుల తర్వాత షోయబ్ పాకిస్థానీ నటి సనా జావెద్(Sana Javed)ను వివాహం చేసుకున్నాడు, కానీ సానియా తన కెరీర్, మాతృత్వంపై దృష్టి సారించింది.
గతంలో టీమ్ఇండియా క్రికెటర్ షమీతో పెళ్లంటూ..
కాగా ఇటీవల సానియా ఒక కాఫీ షాప్‌లో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవి ఆమె రెండో వివాహం(Second marriage) గురించి పుకార్లను రేకెత్తించాయి. గతంలో టీమ్ఇండియా క్రికెటర్ మహ్మద్ షమీని సానియా వివాహం చేసుకోబోతుందనే వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా కొన్ని మీడియా నివేదికలు ఆమె ఓ తెలుగు సినిమా నటుడి(Telugu film actor)తో సంబంధం ఉందని పేర్కొన్నాయి. అయితే ఈ విషయంపై సానియా లేదా ఆమె కుటుంబం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఈ ఊహాగానాలు ఆమె అభిమానుల్లో ఉత్సుకతను రేకెత్తించాయి.

త్వరలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే అవకాశం
ఇదిలా ఉండగా సానియా, ఆరుసార్లు గ్రాండ్‌స్లామ్ విజేతగా, టెన్నిస్ ప్రపంచంలో భారతదేశానికి గర్వకారణంగా నిలిచింది. విడాకుల తర్వాత కూడా ఆమె తన వృత్తిని, మాతృత్వ బాధ్యతలను సమతుల్యం చేస్తూ, దుబాయ్‌లోని ఆడంబరమైన విల్లాలో జీవిస్తోంది. ఆమె సోషల్ మీడియా పోస్ట్‌లు ఆమె జీవనశైలి, కుమారుడితో గడిపే సమయాన్ని అభిమానులతో పంచుకుంటారు. ఈ కొత్త వివాహ రూమర్లు నిజమైతే, సానియా మీర్జా మరోసారి తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. అయితే రెండో పెళ్లి అయినా ఆచి తూచి చేసుకోవాలని ఆమె అభిమానులు సూచిస్తున్నారు. సానియాకు అంతా శుభమే జరగాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.
Tennis star Sania Mirza spotted at Mumbai airport, exuding sporty elegance on the go.
.
.
.
.#SaniaMirza #AirportStyle #MumbaiAirport pic.twitter.com/IL7FzUktuD— Bollywood Helpline (@BollywoodH) July 15, 2025






