ManaEnadu: హైదరాబాద్ మెట్రోరైలు సెకండ్ ఫేజ్లో ప్రతిపాదిత కారిడార్ల ఎలైన్‌మెంట్లు ప్రతిపాదనలు సిద్దం చేశారు. ఆరింటిలో ఐదు కారిడార్లకు పూర్తిస్థాయి ప్రాజెక్టు డీపీఆర్లకు ఆమోదం పడనుంది.116.2 కి.మీ. మెట్రో మార్గాల నిర్మాణానికి రూ.32,237 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఎయిర్పోర్ట్కు వేర్వేరు మార్గాలను పరిశీలించారు.
నాగోల్ – చాంద్రాయణగుట్ట–ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ విమానాశ్రయం మార్గానికే సీఎం ఆమోదం తెలిపారు. విమానాశ్రయం నుంచి అవుటర్, రావిర్యాల మీదుగా ఫోర్త్‌సిటీకి మెట్రో ప్రతిపాదనను రెండో దశలోనే చేర్చారు.
ఐదు కారిడార్ల డీపీఆర్‌లు
ఫోర్త్‌సిటీకి రావిర్యాల మీదుగా మెట్రో అనుసంధానానికి ఆకర్షణీయమైన సౌకర్యాలతో వినూత్న రీతిలో డీపీఆర్ సిద్ధం చేశారు. సుమారు రూ.8వేల కోట్లు వెచ్చించనున్నారు. ఈ కారిడార్ మినహా మిగిలిన ఐదు కారిడార్ల డీపీఆర్‌లను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కేంద్ర ఆమోదం కోసం పంపబోతుంది. ఇతర మెట్రోరైలు ప్రాజెక్టుల మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్త ప్రాజెక్టుగా చేపట్టేందుకు ప్రతిపాదించనున్నారు.