
మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ హీరోకు మూడేళ్లుగా సరైన హిట్ లేదు. అయినా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఇక తాజాగా సీక్వెల్స్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం 2022లో రవితేజ ధమాకా (Dhamaka) చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. తన కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఈ మూవీ నిలిచింది. టాలీవుడ్ మోస్ట్ హాప్పెనింగ్ హీరోయిన్ శ్రీలీల అందులో రవితేజతో కలిసి జతకట్టింది.
మరో సీక్వెల్ కు రవితేజ ప్లాన్
ఇక తాజాగా రవితేజ ధమాకా డైరెక్టర్ నక్కిన త్రినాధరావుతో మరో సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. ఇందులోనూ శ్రీలీల (Sreeleela) హీరోయిన్. దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం రాబోతోందట. అయితే ఇది ధమాకా మూవీ సీక్వెల్ ‘డబుల్ ధమాకా (Double Dhamaka)’ అని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ధమాకా సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు దానికి సీక్వెల్ అనగానే రవితేజ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. మాస్ మహారాజ్ కు సీక్వెల్స్ అసలు కలిసిరావడం లేదని అంటున్నారు.
డబుల్ ధమాకాతో రవితేజ
ఇప్పటికే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ కిక్ కు సీక్వెల్ గా కిక్-2 (Kick 2) తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం ఫ్లాప్ ను మూట గట్టుకుంది. ఇక గతంలో డిస్కోరాజా సినిమాకు కూడా సీక్వెల్ ప్లాన్ చేశారు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో సీక్వెల్ తీసే ఆలోచనను మేకర్స్ పక్కన పెట్టేశారు. ఇక ఇప్పుడు మరో హిట్ మూవీ ధమాకాకు సీక్వెల్ వస్తోందని అనగానే ఈ సీక్వెల్ ఫ్లాప్ సెంటిమెంట్ రవితేజ ఫ్యాన్స్ ను భయపెడుతోంది. మరి మాస్ మహారాజ్ ఎలాంటి ప్లాన్ తో వస్తున్నాడో.. ఈ సీక్వెల్ అయినా హిట్ అవుతుందో చూడాలి.