Honeymoon Murder Case: హనీమూన్ హత్య కేసు.. మరో కీలక వ్యక్తి అరెస్టు

దేశంలో సంచలనం సృష్టించిన హనీమూన్ హత్య కేసు(Honeymoon murder case)లో షిల్లాంగ్ పోలీసులు(Shillong Police) కీలక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇండోర్‌కు చెందిన ప్రాపర్టీ డీలర్ సిలోమ్ జేమ్స్‌(Property dealer Siloam James)ను శనివారం రాత్రి మహాలక్ష్మి నగర్‌లో అదుపులోకి తీసుకున్నారు. రాజా రఘువంశీ, అతని సహచరి సోనమ్ ఉపయోగించిన ఫ్లాట్ నుంచి విలువైన వస్తువులు, నగదు తరలించడంలో జేమ్స్ పాత్ర ఉందని పోలీసులు ఆరోపిస్తున్నారు.

సెక్యూరిటీ గార్డు సహకారంతో..

వివరాల్లోకి వెళితే, రాజా రఘువంశీ(Raja Raghuvanshi) హత్య అనంతరం, అతని ఫ్లాట్ నుంచి ఒక పిస్టల్, సుమారు 5 లక్షల రూపాయల నగదు, బట్టలు, బంగారు ఆభరణాలు మాయమైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ వస్తువులను సిలోమ్ జేమ్స్ దొంగిలించాడని, అతనికి మరో సెక్యూరిటీ గార్డు కూడా సహకరించాడని పోలీసులు తెలిపారు. ఆ సెక్యూరిటీ గార్డు(Security guard)ను కూడా అరెస్ట్ చేసినట్లు ఆదివారం వెల్లడించారు. వీరిద్దరినీ ఈ కేసులో సహ నిందితులుగా చేర్చనున్నట్లు సమాచారం.

CCTV ఫుటేజీలో చూసి గుర్తించారు..

కాగా, సోనమ్(Sonam) అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఉపయోగించిన అద్దె ఫ్లాట్‌పై సిట్(SIT) అధికారులు దృష్టి సారించారు. ఈ ఫ్లాట్‌లో దాచిన ఒక బ్యాగులో దేశవాళీ పిస్టల్, బట్టల్లో చుట్టిన నగదు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, జూన్ 13న సిలోమ్ జేమ్స్ మీడియా ముందుకు వచ్చి, నిందితుల్లో ఒకడైన విశాల్‌(Vishal)ను వార్తా ఫుటేజీలో చూసి గుర్తుపట్టినట్లు చెప్పాడు. అయితే, జూన్ 10న జేమ్స్ తన కారులో ఫ్లాట్ నుంచి ఒక బ్యాగును తీసుకెళ్తున్న దృశ్యాలు CCTV ఫుటేజీలో రికార్డయ్యాయని సిట్ అధికారులు గుర్తించారు. కాగా ఈ కేసులో జేమ్స్‌ను సహ నిందితుడిగా చేర్చి దర్యాప్తు(Investigation) కొనసాగిస్తున్నారు.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Road Accident: పుణ్యక్షేత్రానికి వెళ్తుండగా ప్రమాదం.. 8 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌(UP)లోని బులంద్‌శహర్-అలీగఢ్ సరిహద్దు(Bulandshahr-Aligarh border)లో సోమవారం (ఆగస్టు 25) తెల్లవారుజామున 2:15 గంటల సమయంలో ఘోర రోడ్డు(Road Accident) ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని జహర్‌పీర్ (గోగాజీ) పుణ్యక్షేత్రానికి యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ(Tractor trolley)ని వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *