Jack Twitter Review : ‘జాక్‌’ మూవీ ఎలా ఉంది..? సిద్ధుకు మరో హిట్ పడినట్టేనా?

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) టాలీవుడ్ లో వరుస హిట్లతో జోరు సాగిస్తున్నాడు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ మూవీతో సూపర్ హిట్స్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం సిద్ధు జాక్, తెలుసు కదా అనే చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇందులో వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ఫీ మేల్ లీడ్ లో నటించిన జాక్ చిత్రం ఇవాళ థియేటర్లలో విడుదలైంది. బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉంది..? చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న భాస్కర్ ఈ చిత్రంతో అయినా హిట్ కొట్టాడా..? సిద్ధు జాక్ తో హ్యాట్రిక్ కొట్టాడా..? ఈ సినిమాపై ప్రేక్షకులు ఏమంటున్నారో ఓ లుక్కేద్దామా..?

అబ్బా.. పెద్దగా ఏం లేదండి

ఈ సినిమా (Jack Film) చూసిన ఓ నెటిజన్ ఈ చిత్రంపై తన నిరాశను వ్యక్తపరిచాడు. స్పై యాక్షన్‌ కామెడీ జోనర్‌లో వచ్చి నిరాశనే మిగిల్చిందని ట్వీట్ చేశాడు. స్పై పోర్షన్లతోపాటు చాలా సీన్లలో కామెడీ పండించడంలో కూడా ఫెయిల్‌ అయిందని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. బొమ్మరిల్లు భాస్కర్‌ అన్ని కమర్షియల్‌ హంగులతో సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేసినా.. పేలవమైన స్క్రీన్‌ ప్లే, బలహీనమైన రైటింగ్‌ వల్ల.. ఏ అంశాలు బలమైన ప్రభావం చూపలేకపోయాయని చెప్పుకొచ్చాడు.

ఈ సినిమా చేయకుండా ఉండాల్సింది

ఇక మరికొందరు నెటిజన్లు సిద్ధు తన కెరీర్‌ సెట్ అవుతున్న టైంలో ఇలాంటి సినిమా చేశాడని నిరాశ చెందారు. స్పై యాక్షన్‌ కామెడీ అని చెప్పి చాలా నిరాశకు లోనుచేసేలా సినిమా తీశారని.. బొమ్మరిల్లు భాస్కర్ మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌ కమ్‌ బ్యాక్ ఎంట్రీ ఇచ్చాడు.. కానీ జాక్‌తో మళ్లీ వెనక్కి వెళ్లిపోయాడని ట్వీట్ చేశారు. ఇంకో నెటిజన్.. స్పై జోనర్‌లో వచ్చిన జాక్‌ భారీ నిరాశనే మిగిల్చింది. డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్‌ తాను రాసుకున్న దానికి, డైరెక్ట్‌ చేసిన దానికి మధ్య గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తుంది. స్పై థ్రిల్లర్‌ జోనర్‌లో వచ్చిన స్పూఫ్‌ కామెడీలా.. బోరింగ్‌ గా సాగిందని చెప్పుకొచ్చాడు. మూవీలో కొన్ని కామెడీ సీన్స్, సిద్దు పాత్ర మినహా సినిమాలో ఏది పెద్దగా వర్కవుట్ అవలేదని అభిప్రాయపడ్డారు.

Related Posts

Fish Venkat: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ (Fish Venkat) శుక్రవారం (జులై 18) రాత్రి కన్నుమూశారు. 53 ఏళ్ల ఆయన అసలు పేరు మంగిలంపల్లి వెంకటేశ్. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం(serious illness)తో…

Pawan Kaiyan: భారీ ధరకు హరిహర వీరమల్లు ఓటీటీ డీల్!

పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kaiyan) ప్రధాన పాత్రలో రూపొందిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veera Mallu) ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఎన్నో వాయిదాల తర్వాత ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం జూలై 24న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *