దశాబ్దాలుగా సంగీత ప్రపంచంలో తనదైన స్థానం సంపాదించుకున్న గాయని(Singar) చిత్ర(Chitra)పేరు తెలియని వారు ఉండరు. ఎన్నో భాషల్లో వేలాది పాటలు పాడుతూ సంగీత ప్రపంచాన్నిపరిచయం చేసిన ఈ లెజెండరీ సింగర్‌కి ఇటీవల ఓ దుర్ఘటన జరిగింది. ఈ వార్తలపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు గానీ, తాజాగా స్వయంగా చిత్ర స్పందించడంతో ఆ విషయంపై స్పష్టత వచ్చింది.
తాజాగా స్టార్ సింగర్ సీజన్10 షోలో జడ్జిగా పాల్గొన్న సమయంలో, తనకు జరిగిన ప్రమాదం వివరాలను స్వయంగా వెల్లడించారు. చెన్నై విమానాశ్రయంలో తనకు గాయం జరిగిన విషయాన్ని ఆమె వివరంగా చెప్పుకున్నారు. “హైదరాబాద్‌కు వెళ్ళేందుకు చెన్నై ఎయిర్‌పోర్టులో భద్రతా తనిఖీలు పూర్తయ్యాక, నా భర్త కోసం ఎదురుచూస్తుండగా కొందరు ఫ్యాన్స్ ఫోటోలు తీసుకోవడానికి వచ్చారు. వాళ్లలో ఒకరు ఫోటో తీసుకుంటున్న సమయంలో నా కాలు వెనుక టేబుల్ మీద ట్రేని వదిలేసి వెళ్లారు. నేను దానిని గమనించలేదు.నేను వెనక్కు తిరిగి నడిచే సమయంలో ట్రేకి తగిలి నేలపై పడిపోయాను.”
దీంతో నా భుజానికి దగ్గరగా ఉన్న ఎముక పక్కకు జరిగింది. దాదాపు అంగుళన్నర మేర కదిలిపోయింది. వెంటనే నన్ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. డాక్టర్లు ఎముకను సరి చేశారు. కానీ నాకు కనీసం మూడు వారాల విశ్రాంతి అవసరమని, అలాగే మూడు నెలల పాటు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారని అని చిత్ర వివరించారు.
ఈ మేరకు వచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిత్ర అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని, మళ్లీ మైక్ ముందు కనిపించాలని కోరుతూ ఎమోషనల్ కామెంట్లు చేస్తున్నారు.






