
టాలీవుడ్ సింగర్ కల్పన (Singer Kalpana) ఇటీవల అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఆరోగ్య పరిస్థితిపై హోలిస్టిక్ ఆస్పత్రి వైద్యులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రస్తుతం కల్పన ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. త్వరగా కోలుకుంటున్నారని వెల్లడించారు. మరో రెండ్రోజుల్లో కల్పనన డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. సరైన సమయంలో ఆమెను పోలీసులు ఆస్పత్రికి తీసుకురావడం వల్ల ఆమె ఆరోగ్యం విషమించకుండా త్వరగా కోలుకుంటున్నారని డాక్టర్లు పేర్కొన్నారు.
కల్పన హెల్త్ అప్డేట్
“కల్పనను ఆస్పత్రికి తీసుకువచ్చినప్పుడు ఆమె అపస్మారకస్థితిలో ఉన్నారు. అయితే సరైన సమయంలో చికిత్స అందడం వల్ల ఆమె త్వరితగతిన కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె హెల్దీగా ఉన్నారు. ఊపిరితిత్తుల్లో కొంచెం ఇన్‌ఫెక్షన్ ఉండటంతో ట్రీట్మెంట్ అందిస్తున్నాం. ఆక్సిజన్ సిలిండర్లు తొలగించాం. ఆమె సొంతంగా శ్వాస తీసుకోగలుగుతున్నారు. భోజనం కూడా చేస్తున్నారు’’ అని వైద్యులు తెలిపారు.
కల్పన క్లారిటీ వీడియో
హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని విల్లాలో అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను మంగళవారం సాయంత్రం పోలీసులు, కాలనీవాసులు ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే దీనిపై కల్పన కుమార్తె స్పందిస్తూ తన తల్లి నిద్రలేమితో బాధపడుతున్నారని, నిద్రమాత్రలు ఎక్కువగా వేసుకోవడం వల్ల ఓవర్ డోస్ అయిందని చెప్పారు. ఇక తాజాగా ఇవాళ ఉదయం కల్పన కూడా తమ కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, తాను అత్మహత్యాయత్నం చేయలేదని క్లారిటీ ఇస్తూ వీడియో రిలీజ్ చేశారు.
కావాలనే కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు: Pooja Hegde
సౌత్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనీ ఇచ్చి మరీ తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ బాంబ్ పేల్చింది. తాజాగా ఈ అమ్మడు కావాలనే కొంతమంది తనపై నెగిటివ్…