ICC World Cup 2023 Final: ఆ రెండు జట్ల మధ్యే ప్రపంచకప్ ఫైనల్: టీమిండియా మాజీ ప్లేయర్

దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నం. 2, నం. 3 జట్లు. ఈడెన్ గార్డెన్ మైదానంలో ఈ రెండు జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. లీగ్ మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా జట్టు ఓడిపోయినప్పటికీ, ఇక్కడ మాత్రం ఆస్ట్రేలియాదే పైచేయి అని భావిస్తున్నాను. ఆస్ట్రేలియా బౌలింగ్ అంత బాగా లేకపోయినా బ్యాటింగ్‌లో అద్భుతమైన ఫాంలో ఉన్నారు. నవంబర్ 19న భారత్, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయంటూ తెలిపాడు.

ICC World Cup 2023 Final: ప్రపంచకప్‌ 2023లో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా సెమీ-ఫైనల్‌కు చేరుకున్నాయి. ఈ నాలుగు జట్లలో సెమీస్‌లో గెలిచిన రెండు జట్లు ఫైనల్ ఆడనున్నాయి. అయితే, ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య (IND vs AUS) జరగనుందని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఆయన ప్రకారం, ఈసారి ప్రపంచకప్ ఫైనల్ ఈ రెండు జట్ల మధ్య జరిగేందుకే అవకాశాలు ఉన్నాయని తెలిపాడు.

ఆస్ట్రేలియా జట్టు గురించి మాట్లాడితే, ప్రపంచ కప్‌లో ఆ జట్టు ఆరంభం అంత బాగా లేదు. తమ మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయారు. అయితే, ఆ తర్వాత ఆ జట్టు పునరాగమనం చేసి వరుసగా 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది. అదే సమయంలో భారత జట్టు కూడా వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాను ఓడించగలదు – ఆకాష్ చోప్రా..
ఆకాష్ చోప్రా ప్రకారం, భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు రెండూ గొప్ప ఫామ్‌లో ఉన్నాయి. అందుకే ఫైనల్ మ్యాచ్ ఆ రెండు జట్ల మధ్య మాత్రమే జరిగేందుకు 100 శాతం అవకాశాలున్నాయని ఈ మాజీ టీమిండియా ప్లేయర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పుకొచ్చాడు.

దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నం. 2, నం. 3 జట్లు. ఈడెన్ గార్డెన్ మైదానంలో ఈ రెండు జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. లీగ్ మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా జట్టు ఓడిపోయినప్పటికీ, ఇక్కడ మాత్రం ఆస్ట్రేలియాదే పైచేయి అని భావిస్తున్నాను. ఆస్ట్రేలియా బౌలింగ్ అంత బాగా లేకపోయినా బ్యాటింగ్‌లో అద్భుతమైన ఫాంలో ఉన్నారు. నవంబర్ 19న భారత్, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయంటూ తెలిపాడు.

Related Posts

Border Gavaskar Trophy : హెడ్ 152.. స్మిత్ 101

Mana Endau: భారత్తో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో (Border Gavaskar Trophy) ఆసీస్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. టీమిండియాకు తల నొప్పిగా మారిన ట్రావిస్ హెడ్ (Travis Head) మరోసారి విజృంభించాడు. అతడికి తోడు సీనియర్ ప్లేయర్ స్టీవ్…

ఫైనల్లో భారత్‌ X చైనా

డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత మహిళల జట్టు జూనియర్‌ ఆసియా కప్‌ హాకీ టోర్నమెంట్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం రాత్రి 8.30 గంటలకు జరిగే ఫైనల్లో… జూనియర్‌ ఆసియా కప్‌ హాకీ మస్కట్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత మహిళల జట్టు జూనియర్‌ ఆసియా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *