రివ్యూ రైటర్లు దొ** తినే వాళ్లు.. నటుడు శ్రీకాంత్ దారుణ వ్యాఖ్యలు.. ఫిర్యాదు

ManaEnadu:ముక్కుసూటిగా మాట్లాడే మనిషిగా సోషల్ మీడియాలో పేరు తెచ్చుకున్న నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ SRIKANT IYENGER ఈసారి ఈసారి ఎవరూ ఊహించని రీతిలో రివ్యూ రైటర్లపై కామెంట్స్ చేశారు. దీంతో ఆయనపై మా మూవీస్ అసోషియేషన్‌ ప్రెసిడెంట్ మంచు విష్ణుకు ఫిర్యాదు కూడా వెళ్లింది.

తెలుగు ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల లీడ్ రోల్ పోషించిన ‘పొట్టేల్’ POTTEL సినిమా సక్సెస్ మీట్ ఈరోజు హైదరాబాద్‌లో జరిగింది. ఆ ఫంక్షన్‌ను శ్రీకాంత్ అయ్యంగర్ హాజరై మాట్లాడారు. ఈసందర్భంగా సినిమా రివ్యూలు రాసేవారిపై నోరుపారేసుకున్నారు. ‘ప్రమోషన్స్ ఎక్కువగా రాలేకపోయాను క్షమించాలి. పత్రికా విలేకరులు, మీడియా ప్రతినిధులు అందరూ వచ్చి కోఆపరేట్ చేసి సినిమాను బాగా ముందుకు తీసుకెళ్లారు’ అని మీడియాను పొగిడారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఆ తర్వాత సినిమా రివ్యూయర్లపై పడ్డారు. ‘దరిద్రానికి విరోచనాలు వస్తే రివ్యూ రైటర్లు పుడతారంట. దొడ్డి నాకేటోళ్లు ఈ రివ్యూ రైటర్లు. మనమంతా కలిసి ఈ రివ్యూ రైటర్లను ఆపేయాలి. ఈ సినిమా ల్యాగ్ ఉందని రాశారు. జీవితంలో అసలు కనీసం షార్ట్ ఫిల్మ్ తీయడం చేతకాని నా కొడుకులు కూడా రివ్యూ రాస్తున్నారు. సినిమా తీయడం ఎంత కష్టమో రఫ్ ఐడియా కూడా లేని నా కొడుకులు ఈ రివ్యూ రైటర్లు. ప్రజలు ప్రేక్షక దేవుళ్లు. వాళ్లకు నచ్చితే సినిమాను ముందుకు తీసుకెళతారు. ఈ పొట్టేల్ సినిమా సూపర్. డైరెక్టర్ సినిమాను అద్భుతంగా తీశారు’ అంటూ ముగించారు.

శ్రీకాంత్‌ కామెంట్స్‌పై మంచు విష్ణకు కంప్లైంట్
శ్రీకాంత్ అయ్యంగార్ కామెంట్స్ సినిమా జర్నలిస్టుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ లక్ష్మీనారాయణ ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్ వ్యాఖ్యలను మీడియా తీవ్రంగా ఖండిస్తోందన్నారు. శ్రీకాంత్‌పై తగిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. ఆయన మాటలకు సంబంధించిన వీడియోను సైతం జత చేశారు.

శ్రీకాంత్ కామెంట్స్‌కు కారణం ఏంటి?
అన్ని సినిమాల్లాగే పొట్టేల్ సినిమాకూ సోషల్ మీడియాలో చాలామంది రివ్యూలు ఇచ్చారు. ఎవరికి తోచినంత రేటింగ్ వాళ్లు ఇచ్చారు. అయితే చాలామంది రివ్యూలు ఈ సినిమా ఆశించిన స్థాయిలో లేదన్నట్లే ఉన్నాయి. అయితే అందుకు చెప్పిన కారణాలు శ్రీకాంత్‌కు నచ్చలేదు. ఈ కారణంతోనే ఆయన స్టేజీపైకి వచ్చీ రావడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. నోటికొచ్చినట్లు ఎడాపెడా మాటలు వదిలేశారు. మరి ఆయన వ్యాఖ్యలు ఎక్కడి వరకు వెళతాయో? తర్వాత రివ్యూ రైటర్లు ఎలా స్పందిస్తారో? అన్నింటికంటే ముఖ్యంగా ‘మా’ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనేది ఆసక్తికరంగా మారింది.

 

Share post:

లేటెస్ట్