Star heroines: స్టడీ టు స్టార్‌డమ్.. స్టార్ హీరోయిన్ల రియల్ లైఫ్ స్టోరీ

టాలీవుడ్ లో తమ నటనతో, అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న స్టార్ హీరోయిన్లు విద్యారంగంలోనూ మెరిశారు. వారు ఎం చదివారో, సినీ ప్రవేశం ఎలా చేశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సమంత:
చెన్నైకి చెందిన సమంత బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (B.Com) పూర్తిచేసింది. Stella Maris College చెన్నై లో చదివింది. ఆమె కాలేజ్ రోజుల్లోనే మోడలింగ్ చేయడం మొదలు పెట్టింది. అదే సమయంలో ఆమెకు సినీ అవకాశాలు వచ్చాయి. ”ఏం మాయ చేసావే” సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది.

కాజల్ అగర్వాల్:
ముంబయికి చెందిన కాజల్, సినిమాలపట్ల ఆసక్తి ఉన్నా ముందుగా చదువుపై దృష్టి పెట్టింది. ఆమె మాస్ మీడియాలో డిగ్రీ పూర్తి చేసింది, మార్కెటింగ్ స్పెషలైజేషన్ లో ఆమె K.C. College, ముంబయి నుండి పట్టా పొందింది.

తమన్నా భాటియా:
తమన్నా బాల్యములోనే సినిమా రంగంలోకి ప్రవేశించినా, చదువు పట్ల ఆసక్తితో నేషనల్ కాలేజ్ ముంబయిలో Bachelor of Arts (BA) చదివింది. ఆమె కేవలం 15 ఏళ్ల వయసులో 2005లో తన సినీ కెరీర్‌ను ప్రారంభించింది. తెలుగులో ” శ్రీ” సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

రష్మిక మందన్న:
రష్మిక తన చదువు పూర్తి అయ్యాకే సినిమాల్లోకి ప్రవేశించింది. ఆమె సైకాలజీ, జర్నలిజం మరియు ఇంగ్లీష్ లిటరేచర్ లో డిగ్రీ పట్టా పొందింది. బెంగళూరులోని M.S. Ramaiah College నుండి ఆమె విద్యాభ్యాసం పూర్తిచేసింది.

పూజా హెగ్డే:
పూజా హెగ్డే ఒక బ్రిలియంట్ స్టూడెంట్. ఆమె మాస్టర్ అఫ్ కామర్స్ (M.Com) డిగ్రీ ను పూర్తి చేసింది. ముంబయి లోని M.M.K College లో చదివింది. పూజా హెగ్డే 10 సంవత్సరాల పాటు భారతనాట్యం మరియు క్లాసికల్ డాన్స్‌లో శిక్షణ పొందింది.

రాశీ ఖన్నా:
హిందీ చిత్రాల ద్వారా సినీ రంగంలోకి వచ్చిన రాశీ, తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె ఇంగ్లిష్ లిటరేచర్ లో డిగ్రీ చేసింది. ఢిల్లీలోని Lady Shri Ram College నుండి పట్టా పొందింది.

శ్రీలీల:
శ్రీలీల ఎంబీబీఎస్ చదువుతోంది. ఆమె ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పూర్తి చేయనుంది. శ్రీలీల తన సినీ కెరీర్‌ను 2019లో కన్నడ చిత్రం “కిస్” ద్వారా ప్రారంభించింది. 2021లో “పెళ్లి సందడి” చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది.

త్రిష:
త్రిష చెన్నైలోని ఎతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ లో బాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (BBA) డిగ్రీను పూర్తి చేసింది. 2002లో తమిళ చిత్రం “మౌనం పేసియధే” ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది.

నయనతార:
నయనతార తిరువల్లాలోని మార్తోమా కాలేజ్ (Marthoma College) లో ఇంగ్లీష్ సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీ (B.A.) పూర్తి చేసింది. నయనతార కాలేజీలో చదువుకుంటున్న సమయంలో ఆమె మోడలింగ్‌లో కూడా పాల్గొన్నారు.

సాయి పల్లవి:
సాయి పల్లవి ఆమె టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, జార్జియాలో MBBS డిగ్రీను 2016లో పూర్తి చేసింది. సాయి పల్లవి 2015లో మలయాళ చిత్రం “ప్రేమమ్” (Premam) ద్వారా సినీ రంగంలోకి అడుగుపెటింది. తెలుగులో “ఫిదా” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ చిత్రం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది.

మీనాక్షి చౌదరి:
మీనాక్షి చౌదరి పంజాబ్‌లోని డేరా బస్సీలో ఉన్న నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (BDS) పూర్తి చేసింది. ఆమె రాష్ట్ర స్థాయి ఈత మరియు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి.

సంయుక్త మీనన్:
సంయుక్త మీనన్ ఆర్థికశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీను పూర్తి చేసింది. తెలుగు సినీ పరిశ్రమలోకి 2022లో విడుదలైన “భీమ్లా నాయక్” సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

అనుష్క:
అనుష్క బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీలో కంప్యూటర్ అప్లికేషన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ (BCA) పూర్తి చేసింది. ఆమె యోగా ఇన్‌స్ట్రక్టర్‌గా కూడా పనిచేసింది. 2005లో తెలుగు “సూపర్” చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెటింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *