Stock Markets: స్టాక్ మార్కెట్ క్రాష్.. భారీ నష్టాల్లో సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు(National Stock Market Indices) గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. ట్రేడింగ్‌ ముగింపు(Closing Trade)లో నష్టాల్లో కొనసాగాయి. ప్రధాన షేర్లు క్షీణించడం, అంతర్జాతీయ సంస్థల నుంచి సానుకూల సంకేతాలు లేకపోవడం, ఆసియా మార్కెట్ల బలహీనమైన పనితీరు కారణంగా స్టాక్ మార్కెట్లు(Stock Markets) అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజీ సూచీ BSE సెన్సెక్స్ 1,190 పాయింట్లు లేదా 1.48 శాతం క్షీణత నమోదు చేసింది. 79,043 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ NSE నిఫ్టీ 360 పాయింట్లు లేదా 1.49 శాతం పతనమైంది. 23,914 వద్ద సెటిల్ అయింది. SBI, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ లాభాల్లో ముగిశాయి. M&M, ఇన్ఫోసిస్‌, Bajaj ఫైనాన్స్‌, HCL టెక్నాలజీస్‌, అదానీ పోర్ట్స్‌, SBI Life Insurance నష్టాల్లో ముగిశాయి.

లాభాల స్వీకరణ కోసమే భారీగా అమ్మకాలు

అయితే దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల బాటపట్టడంపై ఆర్థిక నిపుణులు(Financial experts) స్పందిస్తున్నారు. గత రెండు సెషన్లలో పాజిటివ్‌గా ట్రేడ్ అయి రికవరీ సంకేతాలు ఇచ్చిన సూచీలు, ఈరోజు మాత్రం కుప్పకూలాయి. అయితే మార్కెట్లు నష్టాలకు పలు కారణాలున్నాయని అనలిస్టులు చెబుతున్నారు. అమెరికా స్టాక్ మార్కెట్లు(US stock markets) పాజిటివ్‌గా ట్రేడ్ కావడంతో క్రితం రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా సానుకూల సంకేతాల కారణంగా లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. అయితే ఇవాళ US మార్కెట్‌కు సెలవు కావడవంతో అంతర్జాతీయ మార్కెట్ల ట్రెండ్ పై స్పష్టత లేకుండా పోయిందన్నారు. దీంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కోసం భారీగా అమ్మకాలు జరిపారు. ఫలితంగా సూచీలు పతనమైనట్లు హెన్సెక్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్(Hensex Securities Research) AVP మహేశ్ M. ఓజా తెలిపారు.

వేచిచూసే ధోరణితోనే నష్టాలు

ఇదిలా ఉండగా కేంద్ర బడ్జెట్‌(Central budget)కు ఇంకా రెండు నెలలే సమయం ఉండటం, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి గెలిచిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో తెలుసుకునేందుకు ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణి పాటిస్తున్నట్లు ఓజా పేర్కొన్నారు. అందుకే ప్రస్తుతం మార్కెట్లో పాల్గొనట్లేదని చెప్పుకొచ్చారు. మరోవైపు రూపాయితో పోల్చితే డాలర్ విలువ బలపడుతోంది. దీంతో ఇన్వెస్టర్లు(Investors) తమ పెట్టుబడిని గోల్డ్, ఈక్విటీస్ నుంచి మళ్లించి అమెరికా బాండ్, ఫోరెక్స్ మార్కెట్ వైపు తీసుకెళ్తున్నట్లు లక్ష్మిశ్రీ ఇన్వెస్ట్ మెంట్ అండ్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అన్షూల్ జైన్ పేర్కొన్నారు.

Share post:

లేటెస్ట్