Acia Cup 2025: కెప్టెన్‌గా స్కై.. ఆసియా కప్‌కు భారత జట్టు ఎంపిక ఏ రోజంటే?

యూఏఈ(UAE)లో సెప్టెంబర్ 9 నుంచి జరిగే ఆసియా కప్ (Acia Cup 2025) కోసం భారత క్రికెట్ జట్టు(Team India)ను సెలక్షన్ కమిటీ ఆగస్టు 19న ముంబైలో సమావేశం కానుంది. ఆ రోజే జట్టు ఎంపిక జరగనున్నట్లు తెలుస్తోంది. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నమెంట్‌కు సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadhav) నాయకత్వం వహిస్తాడని, అతను స్పోర్ట్స్ హెర్నియా శస్త్రచికిత్స తర్వాత BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో శిక్షణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. శుభ్‌మన్ గిల్(Shubhman Gill) వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశం ఉందని, అతను ఐపీఎల్ 2025లో 650 పరుగులతో రాణించడంతో అతడినే సూర్యకి డిప్యూటీగా ఎంపిక చేస్తారని క్రికెట్ మాజీలు అభిప్రాయపడుతున్నారు.

Asia Cup 2025 Schedule: Check Date, Timing and Venue Details

ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌కి ఛాన్స్

ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(Sanju Samson) కొనసాగే అవకాశం ఉంది. అభిషేక్ టీ20లో ప్రపంచ నంబర్ 1 బ్యాటర్‌గా ఉటడంతో ఓపెనర్‌గా అతడికి కూడా అవకాశం రావొచ్చు. యశస్వీ జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్ కూడా ఎంపికపై చర్చలో ఉన్నారు. కానీ జైస్వాల్‌(Jaiswal)ను రెడ్-బాల్ క్రికెట్‌పై దృష్టి పెట్టమని సూచించినట్లు తెలుస్తోంది. వికెట్ కీపర్‌గా శాంసన్‌తో పాటు జితేష్ శర్మ, ధ్రువ్ జురెల్, ఇషాన్ కిషన్ మధ్య పోటీ ఉంది. రిషభ్ పంత్(Pant) గాయం కారణంగా ఆడటం అనుమానమే.

అయ్యర్‌కు తిలక్ నుంచి గట్టి పోటీ

మిడిల్ ఆర్డర్‌లో తిలక్ వర్మ(Tilak Varma), రింకూ సింగ్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ ఖాయంగా ఉండే అవకాశం ఉంది. శ్రేయాస్ అయ్యర్(Shreyas Ayyar) ఐపీఎల్ 2025లో 604 పరుగులతో రాణించినప్పటికీ, అతడికి తిలక్ వర్మతో పోటీ ఉంది. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఖాయం కాగా, జస్ప్రీత్ బుమ్రా వర్క్‌లోడ్ కారణంగా ఆడకపోవచ్చు. హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ లేదా ఖలీల్ అహ్మద్ రీప్లేస్‌మెంట్‌గా రావచ్చు. కృనాల్ పాండ్య IPL 2025లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో ఆల్‌రౌండర్‌ కోటాలో ఎంపికయ్యే అవకాశం ఉంది. ఈ జట్టు 2026 టీ20 వరల్డ్ కప్‌కు సన్నద్ధత కోసం కీలక ప్రయోగంగా ఉపయోగించుకోవాలని సెలక్షన్ కమిటీ భావిస్తోంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *