
సినీ సెలబ్రిటీల ప్రేమ, పెళ్లి, బ్రేకప్‌ల వ్యవహారాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఎన్నో ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్న జంటలు కూడా అకస్మాత్తుగా తమ బంధానికి గుడ్ బై చెప్పి వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఓ జంట కూడా తమ ప్రేమ బంధాన్ని ముగించినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటవ్వుతారనుకున్న జంట విడిపోయారని వస్తున్న వార్తలు ఇప్పుడు వారి అభిమానులను షాక్ కు గురి చేస్తున్నాయి. ఇంతకీ ఆ జంట ఎవరంటే..?
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia), బీ టౌన్ నటుడు విజయ్ వర్మ (Vijay Varma) కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. కొంతకాలం సీక్రెట్ గా ఉంచిన ఈ రిలేషన్ గోవాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వీడియోలు వైరల్ కావడంతో బయటకు వచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఈవెంట్స్ కు అటెండ్ అవ్వడం, ముంబయి వీధుల్లో చెట్టాపట్టాలు వేసుకుని తిరగడంతో కన్ఫామ్ అయింది. బాలీవుడ్ లో వచ్చిన ఓ సిరీస్ కోసం ఈ జంట కలిసి నటించింది. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది.
అయితే చాలా కాలంగా ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందని వార్తలు వచ్చాయి. కానీ గత కొంతకాలంగా ఈ ఇద్దరు కలిసి కనిపించడం లేదని, విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు బీ టౌన్ మీడియా కోడై కూస్తోంది. ఈ మధ్య ఏ ఈవెంట్ కు అయినా తమన్నా ఒంటరిగానే వస్తోందని బాలీవుడ్ మీడియా జోరుగా ప్రచారం చేస్తోంది. అయితే తమన్నా- విజయ్ విడిపోయారని, అందుకే తమన్నా సింగిల్ గా కనిపిస్తోందనే టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై ఈ జంట క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.