Odela-2: ఓటీటీలోకి వచ్చేసిన ఓదెల-2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) తాజాగా నటించిన చిత్రం ఓదెల-2 (Odela 2). తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఏప్రిల్‌లో బాక్సాఫీస్ ముందుకొచ్చిన ఈ చిత్రం ఓటీటీ వేదిక ‘అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)’లో గురువారం (మే 8) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది. ‘ఓదెల రైల్వే స్టేషన్’కు సీక్వెల్‌గా దర్శకుడు అశోక్ తేజ(Director Ashok Teja) ఈ మూవీని తెరకెక్కించారు. సంపత్ నంది ఈ చిత్రానికి కథ అందించారు.

నాగసాధువుగా తమన్నా..

ఈ సినిమాలో తమన్నా శివశక్తి పాత్రలో నాగసాధువుగా కనిపించింది. ఈ చిత్రాన్ని సంపత్ నంది(Sampath Nandi) టీమ్ వర్క్స్, మధు క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. డైరెక్టర్ సంపత్ నంది ఈ చిత్రానికి కథ అందించారు. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ (Hebah Patel), యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి కీలక పాత్రల్లో నటించారు.

కథ ఏంటంటే..

ఓదెల(Odela) అనే గ్రామంలో జరిగే కథ ఇది. గ్రామంలో భార్య రాథ (Hebba Patel) చేతిలో హత్యకు గురైన తిరుపతి (Vasishtha N. Simha) ఆత్మ, ప్రేతాత్మగా మారి ఊరి ప్రజలపై పగ తీర్చుకోవడం మొదలు పెడుతుంది. గ్రామంలో తిరుపతి ప్రేతాత్మ నవ వధువులను అత్యాచారం చేసి చంపేస్తుంది. దీంతో తిరుపతి భయంకర దుష్టశక్తిగా మారాడని ఓదెల గ్రామస్తులకు తెలుస్తుంది. తిరుపతి ప్రేతాత్మ ఓదెలలో ఇంకెన్ని ప్రాణాలు బలి తీసుకుంది? ఓదెలను కాపాడటానికి వచ్చిన నాగ సాధువు బైరవి (Tamannaah)కి, తిరుపతి ప్రేతాత్మకు మధ్య ఎలాంటి పోరు నడుస్తుంది అనేది ఈ సినిమా కథ.

Related Posts

Fish Venkat: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ (Fish Venkat) శుక్రవారం (జులై 18) రాత్రి కన్నుమూశారు. 53 ఏళ్ల ఆయన అసలు పేరు మంగిలంపల్లి వెంకటేశ్. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం(serious illness)తో…

Pawan Kaiyan: భారీ ధరకు హరిహర వీరమల్లు ఓటీటీ డీల్!

పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kaiyan) ప్రధాన పాత్రలో రూపొందిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veera Mallu) ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఎన్నో వాయిదాల తర్వాత ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం జూలై 24న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *