ఆషిక్ బనాయా అప్నే పాటతో అప్పట్లో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ తనుశ్రీ దత్తా (Tanushree Dutta). నాటి ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ విజేత, క్రేజీ హీరోయిన్ ఇప్పుడు కష్టాల్లో పడింది. తన ఇంట్లోనే తనకు వేధింపులు ఎదురవుతున్నాయని, ఈ బాధ తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తూ బోరున ఏడ్చింది. ఎవరైనా వచ్చి సాయం చేయండి అంటూ కన్నీరుమున్నీరవుతూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారింది. తనుశ్రీకి ఏమైంది అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
ఈ బాధ తట్టుకోలేకపోతున్నా..
తనుశ్రీ దత్తా ఇన్స్టాలో ఓ వీడియో పోస్ట్ చేస్తూ..‘నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు. పోలీసులకు ఫోన్ చేస్తే.. స్టేషన్కు వచ్చి కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. రేపో, ఎల్లుండో పోలీసుల వద్దకు వెళ్తాను. గత నాలుగైదేళ్ల నుంచి ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను. నా ఇల్లంతా చిందరవందరగా అయిపోయింది. పనివాళ్లని పెట్టుకుంటే వాళ్లొచ్చి నా వస్తువుల్ని దొంగలిస్తున్నారు. నా ఇంట్లోనే నాకు భద్రత లేకుండా పోయింది. ఎవరైనా వచ్చి కాస్త నాకు సాయం చేయండి’అని బోరున ఏడ్చింది.
నానా పటేకర్పై లైంగిక ఆరోపణలు
తనుశ్రీ దత్తా 2004లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ విజేతగా నిలిచింది. 2005లో వచ్చిన ‘ఆషిక్ బనాయా అప్నే’ (Aashiq Banaya Apne) సినియాలో టైటిల్ సాంగ్తో గుర్తింపు దక్కించుకుంది. వరుస బాలీవుడ్ మూవీస్తోపాటు పాటు తెలుగులో బాలకృష్ణ సరసన ‘వీరభద్ర’ సినిమాలో యాక్ట్ చేసింది. అయితే 2018లో వచ్చిన మీటూ (#Metoo) ఉద్యమంలో భాగంగా ప్రముఖ నటుడు నానా పటేకర్పై (Nana Patekar) సంచలన ఆరోపణలు చేసింది. తనని లైంగికంగా వేధించాడని పేర్కొంది. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సైతం తనని ఓ సినిమా కోసం నగ్నంగా డ్యాన్స్ చేయమని అడిగాడని ఆరోపణలు చేసింది.
View this post on Instagram






