ఆస్ట్రేలియా ప్రధానితో టీమిండియా ప్లేయర్ల ముచ్చట్లు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా (Border Gavaskar Trophy) టీమిండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. పెర్త్​లో మొదటి టెస్టు ముగియడంతో ప్రాక్టీస్​ కోసం భారత జట్టు కాన్‌బెర్రా చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడి పార్లమెంట్ హౌస్‌లో ఆస్ట్రేలియా (australia) ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ను (Anthony Albanese) కలిశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit sharma) ఆస్ట్రేలియా ప్రధానికి ఆటగాళ్లను పరిచయం చేశాడు. బుమ్రా, విరాట్ కోహ్లీ, అశ్విన్, పంత్‌తో ప్రధాని ఆంథోనీ ముచ్చటిస్తూ కనిపించారు. కోహ్లీని ప్రత్యేకంగా పలకరించిన ప్రధాని.. అతడిచ్చిన సమాధానానికి నవ్వుకుంటూ ముందుకు కదిలారు. భారత ఆటగాళ్లతో కాసేపు సరదాగా గడిపిన ఆయన మ్యాచ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరిగిన తొలి టెస్ట్‌లో తమ ప్రదర్శన తర్వాత టీమిండియా ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. డిసెంబరు 6 నుంచి అడిలైడ్ ఓవల్‌లో జరగనున్న రెండో టెస్టుకు ముందు టీమ్‌ఇండియా ఆటగాళ్లు నవంబర్ 30 నుంచి క్యాన్‌బెర్రాలో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనున్నారు.

భారత్​, ఆస్ట్రేలియా ప్రతిష్ఠాత్మకంగా భావించే బోర్డర్​ గవాస్కర్​ ట్రోపీ మొదటి టెస్టులో భారత్​ దుమ్ముదులిపింది. ఆతిథ్య జట్టును 295 పరుగుల భారీ తేడాతో చిత్తుచేసింది. తొలి ఇన్నింగ్స్​లో కేవలం 150 పరుగులే చేసిన టీమిండియా.. ఈ తర్వాత 104 రన్స్​కే కంగారూ జట్టును కట్టడి చేసింది. కెప్టెన్​ బుమ్రా తన పేస్​ బౌలింగ్​తో ఆస్ట్రేలియా బ్యాటర్లను బెంబేలెత్తించి 5 వికెట్లు తీశాడు. సెకండ్​ ఇన్నింగ్స్​లో జైశ్వాల్​, విరాట్​ కోహ్లీ సెంచరీలకు తోడు కేఎల్​ రాహుల్​ రాణించడంతో భారత్​ 487 రన్స్​ చేసి డిక్లేర్​ చేసింది. ఆ తర్వాత బుమ్రా, సిరాజ్​,హర్షిత్​ రాణా చెలరేగడంతో కంగారూ జట్టు 238 రన్స్​ చేసి ఆలౌట్​ అవడంతో భారత్​ 295 రన్స్​ తేడాతో విజయం సాధించింది.

Share post:

లేటెస్ట్