
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు (Telangana Budget Sessions 2025) ప్రారంభమయ్యాయి. ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Speech) ప్రసంగిస్తున్నారు. గురువారం రోజున గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ప్రభుత్వ సమాధానం ఉంటుంది. ఇక ఇవాళ్టి సమావేశం తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలో నిర్ణయం తీసుకోనున్నారు.
కేసీఆర్ ✊#TelanganaAssembly pic.twitter.com/bVuE2WrXEE
— Praveen Reddy (@Praveen_Prabha_) March 12, 2025
అసెంబ్లీకి కేసీఆర్
నేటి అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ (KCR) హాజరయ్యారు. అంతకు ముందు హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసం నుంచి అసెంబ్లీకి బయల్దేరారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయనకు బీఆర్ఎస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఇక ఈ సెషన్ మొత్తం కేసీఆర్ వస్తారా? లేదా? కేవలం గవర్నర్ ప్రసంగం వరకే ఉంటారా? అనేది తెలియాల్సి ఉంది. ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొనడం గులాబీ నేతల్లో ఉత్సాహం నింపింది.
One of my favourite clips from Assembly .
Common BRSLP let’s get ready for the battle in the assembly for the public of TELANGANA#JaiKCR#JaiBRS pic.twitter.com/xwU1XOY30w
— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) March 11, 2025
ప్రజలే కేంద్రంగా పాలన
ఇక సభ ప్రారంభమైన తర్వాత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తూ.. తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ప్రజలే కేంద్రంగా పాలన సాగుతోందని తెలిపారు. తమ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. రైతులు, మహిళలు, యువతకు అన్నివిధాలా సహకారం ఉంటుందని భరోసా కల్పించారు. అన్ని వర్గాల అభ్యున్నతికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు.
Hon’ble Governor is addressing the 5th Session of the Third Telangana Legislative Assembly, Day 1. తెలంగాణ శాసనసభ సమావేశాలు: ఉభయ సభలను ఉద్దేశించి గౌరవ గవర్నర్ గారి ప్రసంగం. https://t.co/9HxjDq6VKh
— Telangana CMO (@TelanganaCMO) March 12, 2025
ఘన సంస్కృతికి నిలయం తెలంగాణ
“రైతుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఘనమైన సంస్కృతికి నిలయం తెలంగాణ. గద్దర్, అంజయ్య వంటి ఎందరో ప్రజల కోసం కృషి చేశారు. వారి సేవలకు గుర్తుగా వారిని స్మరించుకుంటూ.. మనందరిలో స్ఫూర్తిని నింపేలా పురస్కారాలు కూడా ఇస్తున్నాం. జననీ జయకేతనం రాష్ట్ర గీతంగా చేసుకున్నాం. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించుకున్నాం. అభివృద్ధి, ప్రగతి వైపు తెలంగాణ అడుగులు వేస్తోంది.” అని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.