హైదరాబాద్ః ఉస్మానియా విశ్వవిద్యాలయం కెమికల్ ఇంజనీరింగ్ విభాగం నుండి విజయలక్ష్మి డాక్టరేట్ పొందినట్లు కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ , ఉస్మానియా యూనివర్శిటీ ప్రిన్సిపల్ చింత సాయిలు ,కెమికల్ ఇంజినీరింగ్ అధిపతి శ్రీను నాయక్ ప్రకటించారు.ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని కెమికల్ ఇంజినీరింగ్ విభాగపు విశ్రాంత ఆచార్యులు ఈటకుల నాగ భూషన్ మార్గ దర్శ కత్వము లో స్టడీస్ ఆన్ ప్రిపరేషన్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ వుడ్ – ప్లాస్టిక్ కంపోజిట్స్ యూజింగ్ రీసైకిల్ ఎక్స్పాన్దేడ్ పాలీస్టైరీన్ అండ్ బయోమాస్ మెటీరియల్స్: సస్టైనబుల్ మేనేజ్మెంట్ అప్రోచ్”అనే అంశం పై సిద్ధాంత గ్రంధాన్ని వర్సిటీ కి సమర్పించినట్లు వివరించారు.ఇందుకు గాను ఆమెకు డాక్టరేట్ డిగ్రీ నీ ప్రధానం చేసినట్లు వెల్లడించారు. ఆమె పలు జాతీయ ,అంతర్జాతీయ పరిశోధన జర్నల్స్ లలో అనేక పరిశోధనలు వ్యాసాలను ప్రచురించినట్లు తెలిపారు.
ఈ పరిశోధన, చెక్క-ప్లాస్టిక్ కంపోజిట్స్‌ను తయారు చేయడానికి పునర్వినియోగించిన, విస్తరించిన పాలిస్టైరిన్ మరియు బయోమాస్ పదార్థాలను ఉపcయోగించి పరిశోధన చేయడంపై దృష్టి సారించింది. ఈ పదార్థాలను ఉపయోగించడం ద్వారా, మనం పర్యావరణానికి హాని కలిగించకుండా మరియు భవిష్యత్ తరాల అవసరాలను తీర్చగల విధంగా చెక్క-ప్లాస్టిక్ కంపోజిట్స్‌ను ఉత్పత్తి చేయవచ్చు.
పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఏ. వినయ్ కుమార్ ,వివిధ విభాగాల అధిపతులు మరియు తోటి అద్యాపకులు ఈ సందర్భంగా తమ అభినందనలు తెలియజేశారు.