Telangana Govt: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

మన ఈనాడు: తెలంగాణ ఇచ్చిన పార్టీగా.. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్‌. కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ప్రమాణం చేయగా.. మరో 11మంది కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. వెంటనే తెలంగాణ నూతన కేబినెట్ తొలి సమావేశం జరిగింది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో మంత్రులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి మండలి సమావేశంలో ఆరు గ్యారంటీలపై సుదీర్ఘంగా చర్చించినట్లు పేర్కొన్నారు. 2014- నుంచి2023 డిసెంబర్ 7 వరకు రాష్ట్రఖర్చుపై చర్చించినట్లు తెలిపారు.
తెలంగాణ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై.. శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు శ్రీధర్‌బాబు తెలిపారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9న రెండు గ్యారంటీలు అమలు చేయాలని కేబినెట్ తీర్మానించిందని.. ఆరోజు నుంచి అమలు చేస్తామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, అలాగే ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు హామీలను డిసెంబర్ 9 నుంచి అమలు చేస్తామని తెలిపారు. మిగిలిన నాలుగు గ్యారెంటీలపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో 24 గంటల పాటు విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. 200 ల యూనిట్ల వరకు ఉచితం అన్న హామీ విషయంపై విద్యుత్ శాఖ అధికారులతో చర్చించనున్నట్లు తెలిపారు.

తొలి క్యాబినెట్ సమావేశం హాట్ హాట్ గా సాగింది. విద్యుత్ శాఖ రివ్యూలో విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యుత్ శాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దాచిపెట్టడంపై సీఎం సీరియస్ అయ్యారు. విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని అభిప్రాయపడ్డారు. రేపటిలోగా పూర్తి వివరాలతో రావాలని ఆదేశించారు. సీఎండీ ప్రభాకర్‌రావు రాజీనామాను ఆమోదించవద్దని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా, రేపు విద్యుత్ శాఖపై చర్చించనున్నారు. విద్యుత్ శాఖలో ఇప్పటివరకు 85 వేల కోట్ల అప్పులు ఉన్నట్లు అధికారులు సీఎంకు చెప్పారు.

Related Posts

Khammam|కార‌ణం తెలియ‌దు కానీ..ఖ‌మ్మం ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌రం

ఖ‌మ్మం ప‌త్తి మార్కెట్లో అగ్నిప్ర‌మాదం జ‌ర‌గ‌డానికి త‌న‌కి ఇంకా కార‌ణం తెలియ‌దు కానీ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌రమ‌ని వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు అన్నారు. జిల్లా క‌లెక్ట‌ర్‌, పోలీస్ క‌మిష‌న‌ర్‌తో క‌లిసి గురువారం ఖ‌మ్మం ప‌త్తి మార్కెట్లో ప్ర‌మాదం జ‌రిగిన తీరును…

BIG BREAKING: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దుండగుల దాడి

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‌(Saif Ali Khan)పై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ముంబై(Mumbai)లోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగులు ఇవాళ తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఆయనపై కత్తితో అటాక్(Knife Attack) చేశారు. ఈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *