RTC | మద్యం ముట్టరు..కానీ మత్తులోనే..

Mana Enadu: అల్కాహల్​ తీసుకునే అలవాటు లేకున్నా..అక్కడ మాత్రం మద్యం తాగి విధులకు హజరైనట్లు లెక్కలు చూపిస్తారు. ఖమ్మం(Khammam) జిల్లా  మధిర (Madhira)ఆర్టీసీ అధికారుల తీరుతో తమ జీవితాలకు ఆటంకాలు కల్గుతున్నాయని వాపోతున్నారు.

మధిర బస్సు డిపో లో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న సండ్ర నాగేశ్వరరావు ఆదివారం విధుల్లో భాగంగా మధిర ఆర్టీసీ డిపోకు వెళ్లారు. అక్కడి సెక్యూరిటీ వాళ్లు బ్రీతింగ్ అనలైజర్ టెస్ట్ చేయగా 16 పాయింట్లు రావడంతో విధులకు అనుమతించలేదు. తనకు మద్యపానం , ధూమపానం, గుట్కా వంటి అలవాట్లు లేవని మొత్తుకున్నా అక్కడి అధికారుల పట్టించుకోలేదు. బ్రీతింగ్ అనలైజర్ టెస్ట్ తప్పుగా ఉన్నదని బస్సు డిపో ఎదుట బైఠాయించి నిరసన తెలిపాడు.
మార్చి 8 న మధిర బస్సు డిపో కి చెందిన అమర్లపూడి వెంకట్ కు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తే 329 పాయింట్లు రావడంతో విధులకు రావొద్దని వెనక్కి పంపారు. ఎర్రుపాలెం లో మరోసారి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తే 0 పాయింట్స్ చూపించింది. ఇదే విషయాన్ని బ్రీతింగ్ అనలైజర్ మిషన్ తప్పుగా చూపిస్తుందని అధికారులకు చెప్పారు. కొత్త బ్రీతింగ్ అనలైజర్ మిషన్ ను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ,సీపీఎం, సీపీఐ నాయకులు మద్దతుగా నిలిచారు.

Share post:

లేటెస్ట్