ప్రపంచంలోనే తొలిసారి తెలంగాణలో బ్యాక్​వర్డ్ స్కేటింగ్ .. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన బ్రదర్స్

Mana Enadu : తెలంగాణలో ఇవాళ బ్యాక్​వర్డ్ స్కేటింగ్(backward skating) 300 కిలోమీటర్ల నాన్​స్టాప్ మల్టీ టాస్కింగ్ పోటీలు ప్రారంభమయ్యారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైంది. ప్రపంచంలోనే బ్యాక్​వర్డ్ స్కేటింగ్ పోటీలు జరగడం తెలంగాణలోనే మొదటి. ఈ ఈవెంట్​లో పాల్గొంటున్న తెలంగాణ చిన్నారులు ప్రపంచ రికార్డు క్రియేట్ చేయబోతున్నారు.

రాజేశ్ కుమార్ (13), ఉమేశ్ కుమార్ (12) అనే విద్యార్థులు హైదరాబాద్​లోని హయత్​నగర్ లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్​లో చదువుతున్నారు. ఈ విద్యార్థులకు చదువుతోపాటు ఆటలపైనా ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఇది గుర్తించిన తల్లిదండ్రులు నవీన్ కుమార్, అశ్విని.. వారిని ఆటల వైపు ప్రోత్సహించారు. అయితే ఈ ఇద్దరు చిన్నారులకు స్కేటింగ్(skating) అంటే మక్కువ ఎక్కువ ఉండేది. అందులోనే కోచింగ్ తీసుకోవాలని అనుకున్నారు. ఇదే విషయం తల్లిదండ్రులకు చెప్పగా వారు కూడా ప్రోత్సహించారు.

Skating

అలా పుత్తూరులో ప్రతాప్ అనే ట్రైనర్ వద్ద స్కేటింగ్​లో శిక్షణ తీసుకున్నారు. సాధారణంగా ఐస్ స్కేటింగ్(Ice skating), నార్మల్ స్కేటింగ్ ఉంటాయి. అయితే ఇందులో తాము వినూత్నంగా ప్రయత్నించాలని భావించి బ్యాక్ వర్డ్ స్కేటింగ్ నేర్చుకున్నారు. అందులో బాగా ఆరితేరిన తర్వాత పోటీల్లో పాల్గొనడం ప్రారంభించారు. అలా తాజాగా హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ(Ramoji FIlm CIty) నుంచి భద్రాచలం వరకు ఈరోజు ఉదయం 6 గంటలకు బ్యాక్ వర్డ్ స్కేటింగ్ మొదలు పెట్టారు. ఈ ఈవెంటన్​ను వీక్షించేందుకు వరల్డ్ రికార్డుతో పాటు ఆరు రకాల రికార్డుల అధికారులు హాజరయ్యారు.

ప్రపంచంలోనే మొదటిసారిగా జరుగుతున్న ఈ బ్యాక్ వర్డ్ స్కేటింగ్ ఈవెంట్ ఈ అన్నదమ్ములు పాల్గొని రికార్డు సృష్టించారు. ఇక 300 కిలోమీటర్ల నాన్​స్టాప్ స్కేటింగ్ చేస్తూ మరికొద్ది గంటల్లో ప్రపంచ రికార్డును క్రియేట్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఇవాళ్టి ఈవెంట్ నిర్వహించేందుకు సహకరించిన మంత్రులు పొంగులేటి, భట్టివిక్రమార్క, తుమ్మల, ఎంపీ రామసహాయం రఘురామ్ రెడ్డి, పోలీసులకు ఈ చిన్నారుల తల్లిదండ్రులు, కోచ్ కృతజ్ఞతలు తెలిపారు.

Share post:

లేటెస్ట్