మన ఈనాడు:అసెంబ్లీ ఎన్నికలు ముగియడమే ఆలస్యం.. శాసనమండలి, పార్లమెంట్ ఎన్నికలు మరోసారి రాష్ట్రంలో సెగలు రేకెత్తిస్తున్నాయి. ఊహించిన పరిణామాల నడుమ కొలువు తీరిన కాంగ్రెస్ సర్కారు ఇదే ఊపులో అన్ని ఎన్నికలను గెలిచేందుకు ఓవైపు, ఎలాగైనా పట్టు నిలబెట్టుకోవాలని భాజపా, రాష్ట్రంలో తమ ఉనికే ప్రశ్నార్థకమైన వేళ, దాన్ని కాపాడుకునేందుకు భారాస.. ఏ పార్టీకి ఆ పార్టీ ఎత్తులు వేస్తున్నాయి. అభ్యర్థలు ఎంపికలోనూ ఆచితూచి అడుగేస్తున్నాయి. అన్నీ కలిసొచ్చే గెలుపు గుర్రాలనే బరిలో దించేందుకు కసరత్తు చేస్తున్నాయి. అయితే, ఈ ఎంపీ ఎన్నికల్లో పెద్దపెల్లి పార్లమెంటు స్థానం మరింత ప్రత్యేకంగా నిలవనుంది.
ఇక్కడి స్థానం నుంచి గత ఎన్నికల్లో భారాస తరఫున పోటీ చేసి గెలిచిన వెంకటేశ్ నేతకు టిక్కెట్ లేదని కేసీఆర్ తేల్చేయడంతో ఆయన పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. భారాస తరఫున ఈ స్థానం నుంచి ఇటీవలె ఎమ్మెల్యేగా ఓడిన మాజీ.. బాల్క సుమన్ ను బరిలోకి దింపాలని యోచిస్తున్నారు. తొలుత సీనియర్ నాయకుడు కొప్పులకు సింగరేణిలో పట్టు ఉంటుందని కొందరి సూచన మేరకు ఆ దిశగా ఆలోచించిన కేసీఆర్.. తర్వాతి పరిణామాలతో బాల్క సుమన్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుండగా.. ప్రచారం చేసుకోవాలని సంకేతాలిచ్చినట్లు సమాచారం. ఆ దిశగానే కిందిస్థాయి నేతలకు ఎర వేస్తున్నాడు బాల్క. ఇదే స్థానం నుంచి భాజపా అభ్యర్థిత్వం ఇప్పటికీ స్పష్టత రాకపోగా.. ఈ స్థానంపై భాజపాకు పెద్దగా ఆసక్తి లేదు. మరోసారి బరిలో నిలిచేందుకు పాత అభ్యర్థే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున చాలా దరఖాస్తులే వచ్చినా.. పార్టీకి కీలక నేత కాకా కుటుంబానికే టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం యోచిస్తోంది.
ఈ స్థానానికి ఇప్పటికే వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీ కృష్ణ దరఖాస్తు చేసుకున్నారు. ఆయన అభ్యర్థిత్వం దాదాపు ఖరారైన నేపథ్యంలో తండ్రి చేతిలో ఓడిన బాల్క సుమన్ ఇప్పుడు కొడుకుపై పోరుకు దిగబోతున్నారనే ప్రచారం సాగుతోంది. పెద్దపెల్లి పార్లమెంట్ కింద ఉన్న అన్ని స్థానాలూ వివేక్ కు కంచుకోటలు కాగా.. బెల్లంపల్లి నుంచి ఆయన సోదరుడి వినోద్ ప్రాబల్యం, మంచిర్యాల, ధర్మపురి, ఇతర సింగరేణి బెల్టులోనూ కాంగ్రెస్ హవా నడుస్తుండం అన్నీ వంశీకి కలిసొచ్చే అంశాలే. ఈ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో సీనియర్ నేత వివేక్ వెంకటస్వామికి పట్టుంది.. ఇక్కడి మండల స్థాయి నాయకులతోనూ పరిచయాలున్నాయి. ఈ స్థానం కాంగ్రెస్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలుండటంతో ఇంకాస్త బలంగా పోరాడాలని నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారట.
పెద్దపెల్లి పార్లమెంట్ కింద ఉన్న అన్ని స్థానాలూ వివేక్ కు కంచుకోటలు కాగా.. బెల్లంపల్లి నుంచి ఆయన సోదరుడి వినోద్ ప్రాబల్యం, మంచిర్యాల, ధర్మపురి, ఇతర సింగరేణి బెల్టులోనూ కాంగ్రెస్ హవా నడుస్తుండం అన్నీ వంశీకి కలిసొచ్చే అంశాలే.