గుడ్ న్యూస్.. పోలీసు శాఖలో 12వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్!

తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ (Telangana Police Department) ఉద్యోగులకు తీపికబురు అందించింది. త్వరలోనే ఈ శాఖలో భారీగా పోస్టులు భర్తీ చేయనున్నట్లు సమాచారం. అంచనా ప్రకారం సుమారు 12వేల వరకు ఈ శాఖలో ఖాళీలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు రెడీగా ఉన్నారు. చివరి సారిగా 2022లో నోటిఫికేషన్ విడుదల కాగా 2024లో వారికి నియామక పత్రాలు అందాయి.

ఏకంగా 35వేల నియామకాలు

ఈ నేపథ్యంలో ప్రస్తుతం పోలీసు శాఖలో భారీగా ఖాళీలు (Telangana Police Jobs) ఏర్పడటంతో ఉద్యోగాల భర్తీ చేయాలని ఆ శాఖ భవిస్తోంది. 2007లో లుంబినీపార్కు, గోకుల్‌చాట్‌ వద్ద బాంబు పేలుళ్ల ఘటనతో పోలీసు శాఖను బలోపేతం చేయాలని అప్పుడు ఏకంగా 35వేల నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. భారీ సంఖ్యలో పోస్టుల భర్తీ సాధ్యం కాదని భావించి పలు దఫాలుగా నియామకాల ప్రక్రియ చేపడుతోంది.

12వేల పోస్టుల భర్తీ

ఈ నేపథ్యంలో 2022లో తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్​మెంట్ బోర్డు (Telangana State Police Recruitment Board) 17 వేల పోస్టులను భర్తీ చేసింది.  2022లో చేపట్టిన నియామక ప్రక్రియలో ఎంపికై, ట్రైనింగ్ పూర్తయిన ఎస్సై, కానిస్టేబుల్స్‌కు 2024లో నియామక పత్రాలు అందాయి. ఇప్పుడు మరోసారి భారీగా నియామకాల భర్తీ చేపట్టేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం  రాష్ట్రంలో కానిస్టేబుల్, ఎస్సై స్థాయిలో దాదాపు 12 వేల వరకు ఖాళీలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

Related Posts

Hyderabad Metro: పెరిగిన హైదరాబాద్ మెట్రో ఛార్జీలు

హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరిగాయి. కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి, గరిష్ఠా ఛార్జీ రూ.60 నుంచి రూ.75కు పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ గురువారం ప్రకటించింది. పెంచిన ధరలు ఈ నెల 17 నుంచి అమలు కానున్నట్లు…

Bellamkonda Srinivas: హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై (Bellamkonda Srinivas) కేసు నమోదైంది. రాంగ్ రూట్‌లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీస్తో శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు బుక్ అయ్యింది. ఈనెల 13న జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *