మన ఈనాడుఃతెలంగాణలో ఎలక్షన్ ఫీవర్ రోజురోజుకూ పెరుగుతోంది. రాజకీయ పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తుంటే.. ఎన్నికల అధికారులు ఏర్పాట్లతో హుషారెత్తిస్తున్నారు. కొత్త అప్‌డేట్ ఏంటంటే.. తెలంగాణలో మొత్తం 33 జిల్లాలు ఉండగా.. వాటిలో 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలను రెడీ చేస్తున్నారు. ఈ కేంద్రాలను ఎక్కడ ఏర్పాటు చెయ్యాలి అనే అంశంపై రాష్ట్ర ఎన్నికల అధికారులు.. కొన్ని ప్రదేశాలను ఎంపిక చేసి.. ఆ వివరాల్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. వాటికి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి.. డిసెంబర్ 3న జరిగే కౌంటింగ్ సమయంలో.. ఈ 49 కేంద్రాలే అందరి దృష్టినీ ఆకర్షిస్తాయి.
డిసెంబర్ 3న ఉదయం వేళ.. 49 కౌంటింగ్ కేంద్రాల దగ్గరకు ఆయా నియోజక వర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు వస్తారు. వారి ముందే.. కౌంటింగ్ మొదలవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్, వోట్ ఫ్రమ్ హోమ్ ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలలో సేవ్ అయిన ఓట్ల సంగతి చూస్తారు.
హైదరాబాద్‌లో:
హైదరాబాద్ మహా నగరం అయ్యింది కదా.. అందువల్ల ఈ మెట్రో సిటీలో 14 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో చేపట్టబోతున్నారు. అక్కడైతే.. హై సెక్యూరిటీ ఏర్పాటుకి వీలు ఉంటుంది. మిగతా 13 నియోజకవర్గాలకు విడిగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా కూడా పెద్దది కావడంతో.. అక్కడ నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మిగతా జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…