తెలంగాణ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఖమ్మంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఓ వైపు పువ్వాడ.. మరోవైపు తుమ్మల మాటల తూటాలతో కత్తులు దూస్తున్నారు. బస్తీమే సవాల్ అంటూ రణక్షేత్రంలో తలపడతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన అనంతరం తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలు.. ఆ తర్వాత మంత్రి పువ్వాడ అజయ్ కౌంటర్.. ఇలా రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి.
తెలంగాణ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఖమ్మంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఓ వైపు పువ్వాడ.. మరోవైపు తుమ్మల మాటల తూటాలతో కత్తులు దూస్తున్నారు. బస్తీమే సవాల్ అంటూ రణక్షేత్రంలో తలపడతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన అనంతరం తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలు.. ఆ తర్వాత మంత్రి పువ్వాడ అజయ్ కౌంటర్.. ఇలా రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. తాజాగా.. కాంగ్రెస్ పార్టీ తనపై వేసిన చార్జ్‌షీట్ ఒక అబద్ధాల పుట్ట అంటూ మంత్రి పువ్వాడ అజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏ ఒక్కటి నిజమని రుజువు చేసినా ముక్కు నేలకు రాస్తానని, ఆస్తి రాసిస్తానంటూ ఛాలెంజ్ చేశారు. తాము చేసిన అభివృద్ధిని వాళ్ల ఖాతాలో వేసుకుంటున్నారని, ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని చెప్పుకొచ్చారు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఇద్దరూ జిత్తులమారి నక్కలని, గతంలో 9 మంది బీఆఎస్ అభ్యర్థుల ఓటమికి వారే కారణమని ఆరోపించారు. ఖమ్మంలో సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభ తర్వాత వాళ్లకు ఓటమి భయం పట్టుకుందంటూ పేర్కొన్నారు. ఖమ్మానికి, కేసీఆర్‌కీ ఉన్నది పేగుబంధమని.. ఖమ్మం ఎప్పుడూ బీఆర్‌ఎస్ వైపే ఉంటుందంటూ మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. తెలంగాణ సమాజానికి కేసీఆరే శ్రీరామరక్ష అని.. ఖమ్మంలో సత్తాచాటుతామంటూ పేర్కొన్నారు.
తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్..
ఇదిలాఉంటే.. కేసీఆర్ వ్యాఖ్యల తరువాత మాజీ మంత్రి తుమ్మల సైతం ఫైర్ అయ్యారు. తుమ్మల ముళ్లు కావాలా… పువ్వాడ పువ్వులు కావాలా అంటూ కేసీఆర్ చేసిన కామెంట్‌కి మాజీ మంత్రి తుమ్మల మళ్లీ కౌంటరిచ్చారు. ఖమ్మం జిల్లాకు ఎవరెంత అభివృద్ధి చేశారో తేల్చుకుందాం రమ్మన్నారు. ఎవరి అవసరం ఎంత మేరకుందో ప్రజలే తేలుస్తారన్నారు. ఖమ్మంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న తుమ్మల టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు.
ఖమ్మంలో బీఆర్ఎస్ నుంచి పువ్వాడ అజయ్ కుమార్.. కాంగ్రెస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికల తరువాత ఇద్దరూ మరోసారి ప్రత్యేక్ష పోరుకు సిద్ధమయ్యారు. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పువ్వాడ అజయ్.. టీడీపీ నుంచి పోటీ చేసిన తుమ్మలపై గెలుపొందారు. ఆ తర్వాత మారిన పరిణామాలతో ఇద్దరూ బీఆర్ఎస్ ఓ చేరారు.. ఈ ఎన్నికల్లో తుమ్మలకు పాలేరు సీట్ ఇవ్వకపోవడంతో తుమ్మల కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఖమ్మం అసెంబ్లీ పోరు రసవత్తరంగా మారింది.