Cantonment MLA Lasya Nanditha Passed Away : కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (37)మృతి చెందారు. పటాన్ చెరు ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కారు డ్రైవర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిCantonment MLA Lasya Nanditha Passed AwayCantonment MLA Lasya Nanditha Passed Away : కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. పటాన్ చెరు ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కారు డ్రైవర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి.
ఇదే నెల 13న బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లాలో జరిగిన బహిరంగ సభకు వెళ్లి తిరిగొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య బయటపడ్డారు. అదే రోజు అక్కడ విధులలో ఉన్న హోంగార్డు మృతి చెందారు. పదిరోజుల్లోనే మరోకసారి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే కన్నుమూయాడం తీవ్రమైన విషాదం నింపింది.
కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా సాయన్న అనారోగ్యంతో గతేడాది ఫిబ్రవరి 19న మరణించారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో కూతరు లాస్యనందితకు టిక్కెట్ ఇవ్వడంతో గెలిచారు. తాజాగా కూతురు కూడా ఇదే నెలలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో విషాదం నింపింది.